Karnataka : టిప్పు సుల్తాన్ పేరును వాడటానికి వీల్లేదు...

Karnataka : టిప్పు సుల్తాన్ పేరును వాడటానికి వీల్లేదు...
టిప్పు సుల్తాన్ వారసుల ఆగ్రహం; టిప్పు- సావర్కర్ సిద్దాంతాల మధ్య పోటీ;

టిప్పు సుల్తాన్ పేరును రాజకీయాలలో వాడుకోవడం తగదని అన్నారు టిప్పు ఏడవతరం వారసుడు సహబ్దాదా మన్సూర్ అలీ. కాంగ్రెస్, బీజేపీలు విమర్శించుకోవడానికి టిప్పు పేరును వాడుకుంటున్నారని అన్నారు. మన్సూర్ అలీ మాట్లాడుతూ... టిప్పు సుల్తాన్ పేరును రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకుంటే పరువునష్టం దావా వేస్తామని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు టిప్పు పేరును రాజకీయంగా వాడుకోవడం తమ మనోభావాలను దెబ్బతీసిందని అన్నారు.


"మేము టిప్పు సుల్తాన్ వారసులం, కుటుంబ సభ్యులం, టిప్పు పేరును రాజకీయాల్లో వాడుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. మరోసారి టిప్పు పేరును రాజకీయాలలో వాడుకుంటే పరువునష్టం దావా వేయాలని నిర్ణయించుకున్నాం. టిప్పు సుల్తాన్ కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏమీ చేయలేదు. వాళ్ల ఓట్లకోసం మాత్రమే టిప్పు పేరును ఉపయోగించుకుంటున్నారు." అని మన్సూర్ అలీ అన్నారు.


కర్ణాటక ఎన్నికల హీట్ మొదలైంది. టిప్పు సుల్తాన్ కేంద్రంగా బీజేపీ, కాంగ్రెస్ లు దుమ్మెత్తిపోసుకున్నాయి. కర్ణాటక బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ మాట్లాడుతూ, రానున్న ఎన్నికలు టిప్పు వర్సెస్ సావర్కర్ సిద్దాంతాల మధ్య జరుగుతాయి అని అన్నారు. దీంతో తీవ్ర దుమారం రేగింది. మేము రాముడు, హనుమంతుని వారసులం. టిప్పు వారసులం కాదు, టిప్పు వారసులను ఇంటికి పంపుతాము అని అన్నారు. నేను హనుమంతుని భూమిపై నుంచి సవాలు చేస్తున్నాను, టిప్పును ప్రేమించే వ్యక్తులు ఇక్కడ ఉండకూడదు, రామభజన, హనుమంతుని ప్రార్థన చేసే వ్యక్తులు మాత్రమే ఇక్కడ ఉండాలని నళిన్ కుమార్ అన్నారు.

ఇదిలా ఉండగా... బెంగళూరు - మైసూర్ లను కలిపే ఓ రైలుకు టిప్పు ఎక్స్ ప్రెస్ అని ఉండగా ఆ పేరును మార్చి.. వడయార్ ఎక్స్ ప్రెస్ గా మార్చింది రైల్వే. ఈ విషయంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. రైలు పేరును మార్చినంత తేలికగా, టిప్పు వారసత్వాన్ని ఈ దేశంనుంచి బీజేపీ ఎప్పటికీ తుడిచిపెట్టలేదని అన్నారు.

Tags

Next Story