Karnataka: కర్ణాటకలో ప్రధాని పర్యటన

Karnataka: కర్ణాటకలో ప్రధాని పర్యటన
శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించడంతోపాటు వేలాది కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలో పర్యటిస్తున్నారు. శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించడంతోపాటు వేలాది కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు. మాజీ సీఎం యడ్యూరప్ప డ్రీమ్‌ ప్రాజెక్టుగా చెప్పుకునే శివమొగ్గ ఎయిర్‌పోర్టును ప్రధాని మోడీ ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. శివమొగ్గ ఎయిర్‌పోర్టును కమలం ఆకారంలో 450 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు.

అలాగే మరో రెండు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన,జ‌ల్ జీవ‌న్ మిష‌న్ కింద పలు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాప‌న చేయ‌నున్నారు.మరోవైపు 895 కోట్లకు పైగా విలువైన 44 స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.ఈ ప్రాజెక్ట్‌లలో 110 కిలోమీటర్ల పొడవు గల ఎనిమిది స్మార్ట్ రోడ్ ప్యాకేజీలు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, మల్టీ-లెవల్ కార్ పార్కింగ్ ఉన్నాయి. దీంతోపాటు స్మార్ట్ బస్ షెల్టర్ ప్రాజెక్ట్‌లు, ఇంటెలిజెంట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, పార్కులు, రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.ఆ తరువాత, మోడీ బెలగావికి చేరుకుని ఎనిమిది కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు.

Tags

Next Story