Karnataka: పీయూసీ పరీక్షల్లో డ్రెస్‌ కోడ్‌ తప్పని సరి

Karnataka: పీయూసీ పరీక్షల్లో డ్రెస్‌ కోడ్‌ తప్పని సరి
హిజాబ్‌ సహా ఎలాంటి మతపరమైన చిహ్నాలతో ఉండే దుస్తులతో హాజరయ్యేందుకు అనుమతి లేదన్నారు ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీనాగేశ్‌

కర్ణాటకలో విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈనెల 9న ప్రారంభం కానున్న ద్వితీయ పీయూసీ పరీక్షల్లో డ్రెస్‌ కోడ్‌ తప్పని సరి చేశారు. హిజాబ్‌ సహా ఎలాంటి మతపరమైన చిహ్నాలతో ఉండే దుస్తులతో హాజరయ్యేందుకు అనుమతి లేదన్నారు ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌.హిజాబ్‌ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందు వల్ల అంతకంటే ఎక్కువగా వ్యాఖ్యానించలేదన్నారు. మరోవైపు రాష్ట్రంలో గుర్తింపు లేకుండా అనధికారికంగా చలామణిలో ఉన్న పాఠశాలల సమాచారం సేకరిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రస్తుత వార్షిక ప్రక్రియ ముగిసిన తరువాత చట్టవ్యతిరేకంగా నడుస్తున్న పాఠశాలల జాబితాను విద్యాశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని నిర్ణయించామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story