Karnataka: విధానసభలో 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌

Karnataka:  విధానసభలో 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌
X
గత బడ్జెట్‌ సహా 2018లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ సిద్ధరామయ్య సహా ఇతర నేతలు చెవిలో పువ్వులు పెట్టుకుని సభకు హాజరు

కర్ణాటక విధానసభలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్‌ బొమ్మై. ఐతే బడ్జెట్‌ సమావేశాలకు హాజరైన కాంగ్రెస్ నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గత బడ్జెట్‌ సహా 2018 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ సిద్ధరామయ్య సహా ఇతర నేతలు చెవిలో పువ్వులు పెట్టుకుని సభకు హాజరయ్యారు. మేనిఫెస్టోలో 600 కుపైగా హామీలిచ్చిన అధికార పార్టీలో వాటిలో 10 శాతం కూడా నెరవేర్చలేదన్నారు మాజీ సీఎం సిద్ధరామయ్య. బీజేపీ ప్రజలను ఫూల్స్‌ను చేస్తుందంటూ నిరసన తెలిపారు కాంగ్రెస్ నేతలు. ఈ నిరసనల మధ్య బొమ్మై బడ్జెట్ చదివి వినిపించారు.

Tags

Next Story