Karnataka : ప్రచారంలో రూ.500 నోట్లను ఎగిరేసిన శివకుమార్

Karnataka : ప్రచారంలో రూ.500 నోట్లను ఎగిరేసిన శివకుమార్
వొక్కలిగ సామాజికవర్గానికి కంచుకోటైన మాండ్యలో విస్తృతంగా ప్రచారం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అన్ని పార్టీల నాయకులు ప్రచారాన్ని తీవ్రం చేశారు. కర్నాటక సీఎం క్యాండిడేట్ గాభావిస్తున్న డీకే శివకుమార్ బస్సు యాత్రను చేస్తున్నారు. అందులో భాగంగా మాండ్య జిల్లాలోని బేవినహళ్లిలో ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రూ.500 నోట్లను ప్రజలపై ఎగిరేసారు శివకుమార్. ఈ ఘటన వీడియోలో రికార్డ్ అయింది. ప్రజాధ్వని యాత్రను చేపట్టిన శివకుమార్ వొక్కలిగ సామాజికవర్గానికి కంచుకోటగా చెప్పబడుతున్న మాండ్యలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతం జనతాదళ్ ( సెక్యులర్ ) కంచుకోటగా ఉంది. 2018 ఎన్నికల్లో మాండ్య జిల్లాలో జేడీఎస్‌ ఏడు స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ ఈ ప్రాంతాన్ని తమ హస్తగతం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం తన ప్రచార పర్వంలో శివకుమార్ రూ.500 నోట్లను ప్రజలపై విసరడం చర్చనీయాంశమైంది.


224 మంది సభ్యుల అసెంబ్లీకి గాను కాంగ్రెస్ తొలి జాబితాలో 124 మంది అభ్యర్థులను ప్రకటించింది. కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 121 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్‌కు 70, జేడీఎస్‌కు 30 ఉన్నాయి. 2018లో బీజేపీకి మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2019 లో, కాంగ్రెస్, JDS నుంచి మూకుమ్మడి రాజీనామాల తర్వాత, తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతుతో BJP ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story