Karnataka : భర్త బతికి ఉంటే బొట్టు ఎందుకు పెట్టుకోలేదు : బీజేపీ ఎంపీ

భర్త బతికే ఉన్నా నుదుట బొట్టును ఎందుకు పెట్టుకోలేదని ఓ మహిళను ప్రశ్నించారు బీజేపీ ఎంపీ మునిస్వామి. ఈ ఘటన కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని చంద్రైహ మందిరాలో జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోలార్ లో షాపింగ్ మార్కెట్ ను ప్రారంభించారు మునిస్వామి. అక్కడే ఉన్న ఒక షాపు మహిళను బొట్టు ఎందుకు పెట్టుకోలేదని అడిగారు. మీ భర్త బతికే ఉన్నారుగా అని అంటూనే ఆ అమ్మయికి బొట్టు ఇవ్వండి అని ఇప్పిస్తాడు. అసలు మీకు ఇక్కడ షాపు పెట్టుకోవడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని ప్రశ్నించారు ఎంపీ. మునుస్వామి వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు మహిళ వ్యక్తిగత విషయంలో మునిస్వామి జ్యోక్యం చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు కార్తి చిదంబరం ఈ విషయంపై ట్వీట్ చేశారు. భారతదేశాన్ని 'హిందుత్వ ఇరాన్' గా మారుస్తున్నారని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com