Karnataka: యాచకురాలి దాతృత్వం.. అన్నదానానికి లక్ష రూపాయల విరాళం

Karnataka: యాచకురాలి దాతృత్వం.. అన్నదానానికి లక్ష రూపాయల విరాళం
Karnataka: అయిన వాళ్లు.. అన్నంపెట్టే వాళ్లు లేరు. కట్టుకున్న భర్త, కన్నకొడుకు ఆమెని ఒంటరిగా వదిలేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.

Karnataka: అయిన వాళ్లు.. అన్నంపెట్టే వాళ్లు లేరు. కట్టుకున్న భర్త, కన్నకొడుకు ఆమెని ఒంటరిగా వదిలేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. బ్రతుకును భారంగా ఈడుస్తూ దేవుడి పిలుపుకోసం ఎదురుచూస్తూ పొట్ట నింపుకోవడానికి భిక్షాటన చేస్తోంది. బిచ్చమెత్తుకోగా వచ్చిన డబ్బులను దాచిపెట్టుకుంది.

దయగల మారాజులు ఇచ్చిన డబ్బులు ఆ దేవుడికే చెందాలనుకుంది ఆలయంలో అన్నదానం చేసేందుకు ఇచ్చేస్తోంది. నిలువ నీడ లేకపోయినా నలుగురికీ అన్నం పెట్టే భాగ్యం కలిగినందుకు సంతృప్తి పడుతోంది. ఆ దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు తెలియజేసుకుంటోంది.

కర్ణాటక ఉడుపి రాష్ట్రానికి చెందిన వృద్ధురాలు అశ్వర్థమ్మకు 80 ఏళ్లు. ఆమె రోజు యాచన ద్వారా వచ్చే డబ్బులను పిగ్మీ పొదుపు ఖాతాలో జమ చేస్తానని తెలిపింది. లక్ష రూపాయలు కాగానే ఏదో ఒక ఆలయానికి విరాళంగా ఇస్తుంటానని చెప్పింది. కరోనా సమయంలో అయ్యప్ప మాల ధరించి శబరిమలకు వెళ్లి రూ.1.5 లక్షలు అందజేసినట్లు తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story