యడియూరప్ప రాజీనామాపై ఉత్కంఠ

యడియూరప్ప రాజీనామాపై ఉత్కంఠ

 యడియూరప్ప 

Yediyurappa: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప రాజీనామా చేస్తారని ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.

Yediyurappa: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప రాజీనామా చేస్తారని ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. యడియూరప్ప రాజీనామా ఊహగానాలు స్థానికంగా ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రధాని మోదీతో యడియూరప్ప భేటీలో రాజీనామా అంశం చర్చకు వచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనంతరం బీజీపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ ఆయన సమావేశం అయ్యారు . హోం మంత్రి అమిత్ షాతోనూ సీఎం యడియూరప్ప సమాలోచనలు జరిపారు. వరుసగా భేటీలతో త్వరలో యడియూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారన్న వదంతులు వినిపిస్తున్నాయి.

బీజేపీ అధిష్టానం సైతం కర్ణాటక కొత్త సీఎం వేటలో ఉన్నట్లు కూడా ఊహగానాలు చెలరేగాయి. అయితే కర్ణాటక సీఎం పదవికి రాజీనామా వదంతులను ఖండించారు యడియూరప్ప. వీటిపై యడియూరప్ప క్లారిటీ ఇచ్చారు. బీజేపీ అగ్రనేతలతో జరిగిన భేటీలో రాజీనామా అంశం ప్రస్తావనకు రాలేదని ఆయన తెలిపారు. కర్ణాటక కేబినెట్‌ విస్తరణ కూడా ఇప్పట్లో ఉండదని స్పష్టం చేసిన ఆయన...కేవలం కర్ణాటక రాష్ట్రాభివృద్ధి గురించే ప్రధాని మోదీ, అమిత్‌షాలతో జరిగిన భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిపారు. మరోవైపు కర్ణాటక రాష్ట్ర బీజేపీలో విబేధాల కారణంగా యడియూరప్ప రాజీనామా ఖాయమంటున్నారు బీజేపీలోని ఓ వర్గం నేతలు.

Tags

Read MoreRead Less
Next Story