మాదక ద్రవ్యాల వినియోగం.. కోట్లలో ఆదాయం: సంజన సంపాదన

మాదక ద్రవ్యాల వినియోగం.. కోట్లలో ఆదాయం: సంజన సంపాదన
బింగో అనేది అంతర్జాలంలో నగదు పెట్టుబడి పెట్టి ఆడే ఆట.

కష్టపడితే అంత సొమ్ము రావడం అసాధ్యం. ఇదేదో కచ్చితంగా అక్రమ సంపాదనే. ఏఏ మార్గాల్లో సంపాదించింది.. ఎంత కూడ బెట్టింది.. లెక్క పక్కాగా తేలాల్సిందే అని బెంగళూరు పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఉన్న సినీ నటి సంజనా గల్రానీని వాకబు చేస్తోంది సీసీబీ. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ (ఈడీ) అధికారులు ఆమె అక్రమ సంపాదనపై దృష్టి సారించారు. ఆమె ఆదాయ మూలాలను ఒక్కొక్కటిగా దర్యాప్తు చేసి సమాచారాన్ని రాబడుతున్నారు. ఒకపక్క దర్యాప్తు కొనసాగుతోంది.

మరోపక్క చైనా దేశానికి చెందిన బింగో, హకూనా యాప్‌ల ద్వారా ఆమె నగదు సంపాదిస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చినట్లు సీసీబీ అధికారులు గుర్తించారు. బింగో అనేది అంతర్జాలంలో నగదు పెట్టుబడి పెట్టి ఆడే ఆట. ఇది క్యాసినో జూదాన్ని పోలి ఉంటుంది. హకూన యాప్ ద్వారా ఛాటింగ్, సమాచారం పంపించుకోవడం తదితరాలు కొనసాగించవచ్చు. మాటల ద్వారా బెట్టింగులు చేసి డబ్బు సంపాదించవచ్చని గుర్తించారు. ఈ యాప్ సాయంతో ఆమె నగదు బదీలలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.

ఈ విధమైన పలు అంశాలపై ఈడీ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా విలాసవంతమైన మందు పార్టీలు ఏర్పాటు చేసేది. శ్రీమంతులను, సినీ నటులను, పారిశ్రామిక వేత్తల కుటుంబాలను టార్గెట్ చేసి వారికి మత్తు పదార్థాలు సరఫరా చేసేది. ఆ విధంగా కోట్లలో ఆదాయాన్ని ఆర్జించిందని అనుమానిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story