Karnataka : గాలి జనార్ధన్‌రెడ్డికి ED షాక్‌

Karnataka : గాలి జనార్ధన్‌రెడ్డికి ED షాక్‌

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు మైనింగ్‌ డాన్‌, కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష అధినేత గాలి జనార్ధన్‌రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ షాక్‌ ఇచ్చింది. ఆయన ప్రధాన అనుచరుల్లో ఒకరైన ఖరదపూడి మహేష్‌, ఆయన సోదరులకు చెందిన 30 స్థిరాస్తులను జప్తు చేసింది. వీటి విలువ 54వేల కోట్ల రూపాయలు. కె మహేష్‌తో పాటు ఆయన సోదరులు కె గోవింద రాజ్‌, కె సదాశివ, కె కుమార్‌లు అక్రమంగా ఇనుప ఖనిజాన్ని వివిధ రేవులకు రవాణా చేసినట్లు ఈడీ వెల్లడించింది. గోవా, బెళికెరె, మంగళూరుల రేవులకు ఎలాంటి పర్మిట్లు లేకుండానే 63 కోట్ల రూపాయల ఇనుప ఖనిజాన్ని రవాణా చేసినట్లు వెల్లడించింది. దీనివల్ల ఇనుప ఖనిజంతో పాటు వివిధ పన్నుల రూపేణా కర్ణాటక రాష్ట్ర ఖజానాకు 104 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఈడీ తెలిపింది. 2010లో బళ్ళారి మైనింగ్‌ స్కామ్‌ బద్ధలైన విషయం తెలిసిందే 2013లో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ ఈ కేసును విచారిస్తోంది.

Next Story