Karnataka Lockdown : కర్ణాటకలో మరో రెండు వారల లాక్ డౌన్ పొడిగింపు..!

Karnataka Lockdown : కర్ణాటకలో కరోనా ఉదృతి కొనసాగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 7 వరకు లాక్ డౌన్ పొడిగిచింది. కర్ణాటకలో మే 10 నుంచి లాక్ డౌన్ అమలవుతుంది. ముందుగా మే 24 వరకూ లాక్ డౌన్ నిర్ణయించాలని నిర్ణయించారు. కరోనా వ్యాప్తి అదుపులోకి రాకపోవడంతో తాజాగా దాన్ని మరో రెండువారాలు పెంచారు. కర్ణాటకలో కొత్తగా 32,218 కరోనా కేసులు నమోదు కాగా 353మరణాలు సంభవించాయి. ఇక లాక్ డౌన్ మార్గదర్శకాలలో ఎటువంటి మార్పులు లేవని, అయితే ప్రజలు లాక్ డౌన్ నిబంధనలను పాటించడం లేదని, ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి పోలీసు అధికారులను అనుమతించామని ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప తెలిపారు. నిత్యావసర వస్తువులకి అక్కడ ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల సమయం వరకు అనుమతి ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com