కర్ణాటకలో రాసలీలల సీడీ కేసు దర్యాప్తు ముమ్మరం

కర్ణాటక రాజకీయాల్లో సంచలనం రేపిన ఓ మాజీ మంత్రి రాసలీలల సీడీ కేసు దర్యాప్తు ముమ్మరమైంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి సౌమేంద్రు ముఖర్జీ నేతృత్వంలో ఏడుగురు అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. రంగంలోకి దిగిన సిట్.. వెంటనే ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. సీడీని ప్రసార మాధ్యమాలకు అందించే 3 గంటల ముందే బెంగళూరు నుంచి అంతర్జాలంలో అప్‌లోడ్ చేసినట్టు గుర్తించారు.
అటు.. సీడీని బయటపెట్టి పోలీసులకు ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త దినేశ్‌ను విచారించిన బృందం.. అతని నుంచి రాబట్టిన అంశాల ఆధారంగానే ఐదుగురు పాత్రికేయులు, రామనగరకు చెందిన ఓ యువతిని అదుపులోకి తీసుకుంది. సీడీలో సన్నివేశాలను ఎడిట్ చేసి, ప్రసారం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీడీని మొదటిగా కబ్బన్‌పార్కు పోలీసులకు అందించిన దినేశ్‌ను.. మరోసారి విచారణ చేస్తామని సిట్ ఛీఫ్ సౌమేంద్రు ముఖర్జీ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com