కర్ణాటకలో నిర్మించిన మొదటి రీసైకిల్ ప్లాస్టిక్ హౌస్

పర్యావరణానికి హాని కలిగిస్తుందని తెలిసినా ఉపయోగించకపోతే రోజు గడవనంతగా మమేకమైపోయింది ప్లాస్టిక్ మన జీవితాల్లో. ప్లాస్టిక వ్యర్ధాలు భూమిలో కలవక పర్యావరణానికి హాని కలిగిస్తుంటాయి. వీటితోనే ఇల్లు నిర్మించాలని ఆలోచన చేసింది 'ప్లాస్టిక్స్ ఫర్ చేంజ్ ఇండియా ఫౌండేషన్' సంస్థ. ప్లాస్టిక్ ని రీసైకిల్ చేసి కర్ణాటకలో ఓ ఇంటిని నిర్మించింది. అందుకోసం రూ.4.50 లక్షలు ఖర్చయినట్లు సంస్థ పేర్కొంది.
సంస్థకు చెందిన చీఫ్ ఇంపాక్ట్ ఆఫీసర్ షిఫ్రా జాకబ్స్ మీడియాతో మాట్లాడుతూ లబ్ధిదారులలో ఒకరైన కమల ఇంటి నిర్మాణానికి 1,500 కిలోల రీసైకిల్ ప్లాస్టిక్‌ను ఉపయోగించినట్లు తెలిపారు. రీసైకిల్ ప్లాస్టిక్ ద్వారా ఉత్పత్తి చేయబడిన 60 ప్యానెల్లు ఇందుకోసం ఉపయోగించారు. ప్రతి ప్యానెల్ 25 కిలోల ప్లాస్టిక్ ని ఉపయోగించి తయారు చేశారు.
"ఇది ఒక వినూత్న పర్యావరణ హానిరహిత ప్రాజెక్ట్. ఇది ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి తక్కువ ఖర్చుతో నిర్మించిన ఇల్లు ఇది అని పేర్కొన్నారు. "ఇది కర్ణాటకలోని మంగళూరులో పర్యావరణ అనుకూలమైన 'రీసైకిల్ ప్లాస్టిక్ హౌస్'. ఇల్లు నిర్మించే ముందు నిర్మాణ సామాగ్రి మన్నిక పరీక్ష జరిగింది, "అని ఆమె చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన నిర్మాణ భాగస్వామి సహాయంతో ఈ ఇంటిని నిర్మించారు. ఒకేసారి ఎక్కువ ఇళ్ళు నిర్మిస్తే నిర్మాణ వ్యయాన్ని తగ్గించవచ్చని ఆమె తెలిపారు.
"రెండవ దశలో, మేము అలాంటి 20 ఇళ్లను తీసుకురావాలని యోచిస్తున్నాము. ఇందుకోసం 20 టన్నులకు పైగా ప్లాస్టిక్ ఉపయోగించబడుతుంది. మరుగుదొడ్ల నిర్మాణంతో సహా బహుళ అంతస్థుల భవనాల కోసం కూడా దీనిని ఉపయోగించవచ్చు, "అని షిఫ్రా తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com