Karnataka: అయ్యో పాపం.. ఆరేళ్ల చిన్నారిని చంపేసిన చాక్లెట్..

Karnataka: అయ్యో పాపం.. ఆరేళ్ల చిన్నారిని చంపేసిన చాక్లెట్..
Karnataka: అమ్మ అన్నీ పెట్టినా రాని ఆనందం ఒక్క చాక్లెట్ ఇస్తే చాలు చిన్నారులకు ఎంత సంతోషమో.

Karnataka: అమ్మ అన్నీ పెట్టినా రాని ఆనందం ఒక్క చాక్లెట్ ఇస్తే చాలు చిన్నారులకు ఎంత సంతోషమో. ఆనందంతో అమ్మకు ఓ ముద్దిచ్చేసి ఏపని చేప్పినా ఇప్పుడు చెప్పు చేసేస్తా అన్నట్లు ఉంటారు.. అంతిష్టం పిల్లలకు చాక్లెట్లంటే. కానీ ఆ చాక్లెటే చిన్నారి ప్రాణాలు తీసింది.

కర్ణాటకలోని ఉడిపి జిల్లా బందూర్ పట్టణానికి సమీపంలోని బిజూర్ గ్రామంలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక బుధవారం చాక్లెట్ తిని మృతి చెందింది. మృతురాలు వివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న సమన్విగా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తన ఇంటి సమీపంలో స్కూల్ బస్సు ఎక్కుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బుధవారం పాఠశాలకు వెళ్లేందుకు సమన్వి సిద్ధంగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆమెను పాఠశాలకు వెళ్లమని ఒప్పించారు. సమన్వి తల్లి సుప్రీతా పూజారి స్కూలుకు వెళితే చాక్లెట్ ఇస్తానని అనడంతో బ్యాగు తీసుకుని బయల్ధేరింది. అమ్మ ఇచ్చిన చాక్లెట్ తీసుకుని పరుగున బయటకు వచ్చింది.

స్కూల్ వ్యాన్ రావడం చూసి బాలిక హడావుడిగా రేపర్‌తో పాటు చాక్లెట్‌ని నోట్లో పెట్టుకుంది. పరిగెత్తుతుండగా రేపర్‌తో పాటుగా చాక్లెట్‌ను నోట్లో పెట్టుకోవడంతో అది కాస్తా గొంతుకు అడ్డం పడింది. బస్సెక్కగానే పడిపోయింది. దాంతో డ్రైవర్ వెంటనే బస్ ఆపి అపస్మారక స్థితిలో ఉన్న సమన్విని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే బాలిక మతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. రేపర్‌తో సహా చాక్లెట్ మింగి విద్యార్థిని మృతి చెందిందా.. లేక ఆమెకు ముందస్తు సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది ఇంకా తెలియరాలేదు. బండూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story