Hijab Issue: హిజాబ్ బ్యాన్‌పై సుప్రీంకోర్టు తీర్పు ..

Hijab Issue: హిజాబ్ బ్యాన్‌పై  సుప్రీంకోర్టు తీర్పు ..
Hijab Issue: సుప్రీంకోర్టులో హిజాబ్ కు మద్దతుగా పిటిషనర్ల తరుపున న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు.

Hijab Issue: హిజాబ్ బ్యాన్ పై సుప్రీంకోర్టు తన తీర్పు కాసేపట్లో వెల్లడించే అవకాశం ఉంది. హిజాబ్ ధరించి స్కూళ్లు, కాలేజీలకు రావడాన్ని నిషేధించింది కర్ణాటక ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయంపై కొందరు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా.. హిజాబ్ అనేది ఇస్లాంలో తప్పనిసరి ఆచారం కాదని, హిజాబ్ ధరించి విద్యాలయాలకు రావడాన్ని నిషేధించింది. కర్ణాటక హైకోర్టు తీర్పుపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం 10 రోజుల పాటు విచారించింది. సెప్టెంబర్ 22న తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ఈరోజు ధర్మాసనం తన తీర్పును ప్రకటించే అవకాశం ఉంది.

మరోవైపు సుప్రీంకోర్టులో హిజాబ్ కు మద్దతుగా పిటిషనర్ల తరుపున న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. ముస్లిం బాలికలు హిజాబ్ లేకుండా పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారని.. దీంతో వారి చదువులకు ఆటంకం ఏర్పడుతుందని.. చాలామంది పాఠశాలకు వెళ్లడమే మానేశారని సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే విద్యాసంస్ధలో సమానత్వం,సమగ్రతకు భంగం కలిగిస్తున్నాయనే హిజాబ్‌ను నిషేధిస్తూ కర్ణాటక రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన జీఓలోని అంశాలను సుప్రీంకోర్టుకు వివరించారు ప్రభుత్వం తరుపున న్యాయవాదులు.

అయితే ఈ కేసును ముందుగా రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేయాలని పలువురు డిమాండ్ చేశారు. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని సమర్థిస్తూ కొందరు వ్యక్తులు ఆందోళనలు చేయడం ఓ పథకంలో భాగమని ప్రభుత్వం తరుపున న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు. మార్చి 15న కర్ణాటకలోని ఉడిపిలోని ప్రభుత్వం ప్రీ యూనివర్సిటీ గర్ల్స్ కాలేజీకి చెందిన ముస్లిం విద్యార్థలు తరగతి గదులలో హిజాబ్ ధరించడానికి అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు కొట్టేసింది. ఈ హిజాబ్ వివాదం ఉడిపి నుంచి కర్ణాటకలోని చిక్ మంగళూర్, మాండ్యా, బాగల్ కోట్, దక్షిణ కన్నడ జిల్లా, బెంగళూర్, తుముకూరు, చిక్ బల్లాపూర్, శివమొగ్గ జిల్లాలకు కూడా వ్యాపించింది.

Tags

Read MoreRead Less
Next Story