Karnataka Hijab Issue : "పరీక్షలు రాయాలంటే హిజబ్ ను అనుమతించండి"

కర్ణాటకలో హిజబ్ వివాదం మరోసారి చర్చనీయంశంగా మారింది. పీయూసీ ( ఇంటర్మీడియట్ ) పరీక్షలు రాయడానికి వెళ్లేందుకు హిజబ్ ను అనుమతించాలని విద్యార్థినులు కోరారు ముస్లిం విద్యార్థినులు. మార్చి 9న పరీక్షలు మొదలవనున్నాయి. బాలికల తరపున న్యాయవాది హిజబ్ ను పరీక్షా హాలుకు అనుమతించాలని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై స్పందించిన భారత ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్, అత్యవసర విచారణ కోసం బెంచ్ ను ఏర్పాటు చేయనున్నట్లు హామీ ఇచ్చారు.
మార్చి 9న పరీక్షలు ప్రారంభంకానున్నాయని అనుమతి లభించకపోతే ఒక సంవత్సరం నష్టపోతారని బాలికల తరపున న్యాయవాది షాదన్ ఫరస్ CJI ముందు ప్రస్తావించారు.
* పరీక్షలు రాయకుండా ముస్లిం బాలికలను ఎవరు ఆపుతున్నారని బాలికల తరపున న్యాయవాదిని CJI ప్రశ్నించగా, హిజబ్ లేకుండా బాలికలను బయటకు పంపడానికి వారి ఇళ్లల్లో ఒప్పుకోరని తెలిపారు. పరీక్షకు అటెండ్ అవకపోతే ఒక విద్యా సంవత్సరాన్ని బాలికలు కోల్పోవలసి వస్తుందని చెప్పారు. తాము ఉపశమనం మాత్రమే కోరుతున్నామని న్యాయవాది తెలిపారు.
ముస్లిం మహిళలు హిజబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదని, ప్రభుత్వ కాలేజీల్లో యునిఫాం ఆదేశాన్ని అమలు చేసే అధికారం కర్ణాటక ప్రభుత్వానికి ఉందని గత ఏడాది కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై పిటిషనర్లు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com