Karnataka Hijab Row: తీర్పు కోసం ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం

కర్ణాటక తరగతి గదుల్లో హిజాబ్ ధరించడంపై గతేడాది ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన విభజన తీర్పును సవాలు చేస్తూ ధాఖలైన పిటిషన్ పై సూప్రీం కోర్టు స్పందించింది. ఈ మేరకు హిజాబ్ ధారణపై తుది తీర్పును వెలవరించేందుకు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ విషయాన్ని సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా చీఫ్ జస్టిస్ డి.వై చంద్రచుడ్ నేతృత్వంలోని బెంచ్ ముందు ప్రస్తావించారు. ఫిబ్రవరిలో పరీక్షలు జరగనున్నాయని వాటి దృష్ట్యా ఈ విషయం అత్యవసరమని, ఇంతకు ముందు ఇచ్చిన తీర్పు వల్ల విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలకు వెళ్లారని ఆమె తెలిపారు.
పరీక్షలు ప్రభుత్వ కళాశాలలలో మాత్రమే నిర్వహిస్తారని అందువల్ల విద్యార్థినిలు హిజాబ్ ధరించి పరీక్షలకు హాజరయ్యేలా అనుమతించవచ్చునని అరోరా స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు, గత ఏడాది అక్టోబర్‌లో, కర్ణాటకలోని ప్రీ యూనివర్శిటీ కాలేజీలలో కొంతమంది ముస్లిం విద్యార్థినిలు హిజాబ్ ధరించిడం నిషేధమని సవాలు చేస్తూ వేసిన పిటిషన్లపై న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం ద్వంద తీర్పు ఇచ్చింది. జస్టిస్ గుప్తా కర్ణాటక ప్రభుత్వ సర్క్యూలర్‌ను సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా చేసిన అప్పీళ్లను తోసిపుచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com