IPS vs IAS fight: ఐపిఎస్, ఐఎఎస్ అధికారుల మధ్య గొడవకు తెర.. బదిలీతో చెక్..

IPS vs IAS fight: కొన్ని ప్రైవేట్ ఫోటోలను షేర్ చేయడంపై సోషల్ మీడియాలో ఇద్దరు సివిల్ సర్వెంట్ల మధ్య గొడవ చెలరేగి వివాదాస్పదమైంది. దీంతో అధికారులు రంగంలోకి దిగి వారిపై బదిలీ వేటు వేశారు. ఐపిఎస్ అధికారి డి రూప మౌద్గిల్, ఐఎఎస్ అధికారి రోహిణి సింధూరిలను ముందస్తు సమాచారం లేకుండా బదిలీ చేశారు.
ఇద్దరి మధ్య చోటు చేసుకున్న వివాదాలు వారిపై ప్రజల్లో చులకన భావాన్ని తీసుకొస్తున్నాయి. దీంతో IAS అధికారిణి రోహిణి సింధూరి, IPS అధికారి D. రూప మౌద్గిల్‌లకు కర్ణాటక ప్రభుత్వం నోటీసులు అందజేసింది. మీడియాకు ఎక్కవద్దు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత విషయాలు పంచుకోవద్దని అధికారులను కోరారు.
"మీ అభ్యంతరాలు, ఫిర్యాదులను దాఖలు చేయడానికి ఒక ఫోరమ్ ఉన్నప్పటికీ, మీరు మీడియాకు ఎక్కి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చారు" అని నోటీసులో పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com