మంత్రిపదవికి రాజీనామాచేసిన కర్నాటక మంత్రి రమేష్ జార్కిహోళి .. !

మంత్రిపదవికి రాజీనామాచేసిన కర్నాటక మంత్రి రమేష్ జార్కిహోళి .. !
మొదట ఆ వీడియోలో ఉన్నది తాను కాదన్న మంత్రి రమేష్... చివరకు రాజీనామా లేఖలు స్పీకర్‌కు పంపించారు.

కర్నాటక రాజకీయాల్లో కలకలం రేపిన...శృంగార వీడియోలలో ఉన్న మంత్రి రమేష్‌ జార్కిహోళి తన పదవికి రాజీనామా చేశారు. మంత్రి ఓ యువతితో సాగించిన కామకేళి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో విపక్షాలతోపాటు స్వపక్షంలోను తీవ్ర విమర్శలు వచ్చాయి. మొదట ఆ వీడియోలో ఉన్నది తాను కాదన్న మంత్రి రమేష్... చివరకు రాజీనామా లేఖలు స్పీకర్‌కు పంపించారు.

ఓ షార్ట్ ఫిల్మ్ తీసేందుకు సహకరం కావాలంటూ మంత్రి రమేశ్‌ దగ్గరకు ఓ యువతి వచ్చింది. అయితే ఆ యువతిని మంత్రి ప్రలోభపెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేపీటీసీఎల్‌లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నట్లు చెబుతున్నారు. మంత్రి కామక్రీడల వీడియో బయటకు రావడంతో యడియూరప్ప సర్కార్‌ ఉలిక్కిపడింది. ఇది పక్కా హనీ ట్రాప్ అని అధికార పార్టీ నేతలు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. రాజకీయ విరోధులే ట్రాప్‌ చేసి.. ఇలా వీడియో తీసి.. బయటపెట్టారని ఆరోపిస్తున్నారు.

మేశ్‌ జార్కిహోలి ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో ఉండేవారు. ఆ తరువాత బీజేపీలోకి జంప్ చేశారు. తనతో పాటు కొంత మంది ఎమ్మెల్యేలను సైతం బీజేపీలోకి తీసుకెళ్లారు. కర్నాటకలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో రమేశ్‌ కీలక పాత్ర పోషించారు. యడియూరప్ప సీఎం అయ్యాక.. ప్రాధాన్యత కలిగిన నీటిపారుదల శాఖ కేటాయించారు. తమ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకే ఇలా హనీ ట్రాప్ చేశారని ఆరోపిస్తోంది కర్నాటక బీజేపీ.

మంత్రి సెక్స్‌ స్కామ్‌పై దినేష్ మలహల్లి అనే ఆర్టీఐ కార్యకర్త.. కబ్బన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే దీనిపై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదు. బహుశా పరస్పర ఆమోదంతో జరిగిన శృంగారంగా భావిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో మహిళా సంఘాలు విరుచుకుపడ్డాయి. యువతిని ప్రలోభపెట్టి, లొంగదీసుకున్నారని.. మంత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఓ మంత్రిగా అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి.. ఇంత నీచంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి మహిళా సంఘాలు.

మొత్తానికి కర్నాటక బీజేపీ సర్కార్‌ పెద్ద సంక్షోభంలోనే పడింది. ఏ వ్యక్తి వల్ల పార్టీ బలపడిందో.. అదే వ్యక్తి కారణంగా పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని బీజేపీ నేతలే చెప్పుకుంటున్నారు. వ్యవహారం తీవ్ర దుమారం రేపడం, అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో చివరకు మంత్రి పదవికి రాజీనామా చేశారు రమేష్‌. తన రాజీనామా లేఖను స్పీకర్‌కు అందజేశారు.

Tags

Read MoreRead Less
Next Story