Karnataka: బ్రైడల్ మేకప్ బెడిసి కొట్టింది.. పెళ్లొద్దన్న వరుడు

Karnataka: మినిమమ్ మేకప్ అవసరమే.. మరీ అతిగా ఉంటే అసహ్యంగా ఉంటుంది. అందవికారంగా తయారవుతుంది. ఎంగేజ్‌మెంట్ రోజు ఎంత బావుంది.. ఈ రోజేంటి ఇలా ఉంది.. వామ్మో నాకీ పెళ్లీ వద్దు. ఈ అమ్మాయీ వద్దు అని పెళ్లి పీటల మీద నుంచి పరుగు పెట్టాడు పెళ్లి కొడుకు. కర్ణాటకలోని హాసన్ జిల్లా అరసికెరె గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రైడల్ మేకప్‌తో ఉబ్బిపోయిన ముఖాన్ని చూసుకుని ఆమె కూడా కలత చెందింది. మేకప్‌కి ఉపయోగించిన కెమికల్స్‌లో ఏం పడలేదో ఏమో అని ఆమె కూడా ఆస్పత్రికి పరిగెట్టింది. స్థానిక బ్యూటీ పార్లర్‌కు వెళ్లడంతో వధువు ముఖం రూపురేఖలు లేకుండా పోయింది. పీటల మీద పెళ్లి ఆగిపోయింది. మేకప్‌లో భాగంగా వధువు ముఖానికి ఫౌండేషన్ అప్లికేషన్ తర్వాత, ఆవిరి పట్టించారు. దాంతో వెంటనే ఆమె ముఖం కాలినట్లై వాచిపోయింది.
పెళ్లికి ముందు వధువు గంగాశ్రీ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ స్పాలో మేకప్ చేయించుకుంది. బ్యూటీ పార్లర్ యజమాని గంగ.. పెళ్లికి కొత్త తరహా మేకప్ ఎంచుకోవాలని సూచించింది. మేకప్ వేసుకునే ముందు, బ్యూటీషియన్ వధువుకి స్టీమ్ ఫేషియల్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె ముఖం ఉబ్బి నల్లగా మారింది. మహిళ వికృతమైన ముఖాన్ని చూసిన వరుడు ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు బ్యూటీపార్లర్ యజమానిని పిలిచి విచారిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com