Kartikeya Jakhar: యూట్యూబ్ చూసి.. 12 ఏళ్లకే మూడు లెర్నింగ్ యాప్‌లు..

Kartikeya Jakhar: యూట్యూబ్ చూసి.. 12 ఏళ్లకే మూడు లెర్నింగ్ యాప్‌లు..
Kartikeya Jakhar: టెక్నాలజీ ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. చేతిలో ఉన్న ఫోనుతో ప్రపంచంలో జరిగే వింతలూ విశేషాలు తెలుసుకోవడంతో పాటు ఆసక్తి ఉన్న ఎన్నో కొత్త అంశాలను కూడా నేర్చుకోవచ్చు.

Kartikeya Jakhar: టెక్నాలజీ ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. చేతిలో ఉన్న ఫోనుతో ప్రపంచంలో జరిగే వింతలూ విశేషాలు తెలుసుకోవడంతో పాటు ఆసక్తి ఉన్న ఎన్నో కొత్త అంశాలను కూడా నేర్చుకోవచ్చు. అందులో ప్రావిణ్యం సంపాదించొచ్చు. 12 ఏళ్ల బాలుడు సాధించిన ఘనత చూస్తే ఆశ్చర్యం అనిపించకమానదు.

హరియాణాకు చెందిన బాలుడు అతి పిన్న వయస్కుడైన యాప్ డెవలపర్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు. కేవలం యూట్యూబ్ చూసి మూడు లెర్నింగ్ యాప్‌లను స్వయంగా తయారు చేసి రికార్డు సృష్టించాడు.

ఝజ్జర్‌లోని కార్తికేయ జఖర్ జవహర్ నవోదయ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఎవరి దగ్గర శిక్షణ తీసుకోకుండానే మూడు లెర్నింగ్ అప్లికేషన్‌లను రూపొందించాడు. అంతేకాదు అమెరికాలో హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్‌ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. స్కాలర్‌షిప్‌తో చదువుకుంటున్నాడు.

కార్తికేయ మాట్లాడుతూ.. కోడింగ్ ప్రక్రియలో భాగంగా మొబైల్ ఫోన్‌తో తానెదుర్కొన్న ఇబ్బందులను వివరించడాడు.. సీరియస్‌గా పని చేసుకుంటున్న సమయంలో ఫోన్ హ్యాంగ్ అయ్యేది. దాంతో యూట్యూబ్ చూసి ఫోన్‌ని ఫిక్స్ చేయడం నేర్చుకున్నాడు. ఆ విధంగా చదువు కొనసాగించానని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే మూడు యాప్‌లు తయారు చేసినట్లు చెప్పాడు. ఒకటి లూసెంట్ జికె ఆన్‌లైన్ కాగా, రెండోది కోడింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ కోసం రామ్ కార్తీక్ లెర్నింగ్ సెంటర్, శ్రీరామ్ కార్తీక్ డిజిటల్ ఎడ్యుకేషన్ అనే మూడు యాప్‌లు రూపొందించినట్లు తెలిపాడు. ప్రస్తుతం 45 వేలమంది విద్యార్థులకు ఉచితంగా శిక్షణ కూడా ఇస్తున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story