Kashmir : ఉగ్రవాదుల కాల్పుల్లో బ్యాంకు గార్డు మృతి

Kashmir : ఉగ్రవాదుల కాల్పుల్లో బ్యాంకు గార్డు మృతి

దక్షిణ కాశ్మీర్ లో ఉగ్రవాదులు ఓ బ్యాంకు సెక్యూరిటీ గార్డును హతమార్చారు. కాశ్మీర్, పుల్వామా జిల్లాలోని అచన్ ప్రాంతంలో ఆదివారం కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆదివారం ఉదయం అచన్ లో నివసిస్తున్న సంజయ్ పండిత్ అనే వ్యక్తిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ సంజయ్ శర్మ మృతిచెందారు.

కాశ్మీర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. సంజయ్ శర్మ స్థానిక మార్కెట్ కు వెళ్తుండగా ఓ వ్యక్తి అతనిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకోవడానికి బలగాలు గాలిస్తున్నాయని చెప్పారు.

Next Story