KCR Flexi : దేశ్ కి నేత కేసీఆర్ అంటూ రాంచీలో ఫ్లెక్సీలు..!

KCR Flexi : జార్ఖండ్ రాజధాని రాంచీలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశ్ కి నేత కేసీఆర్ అంటూ తెలంగాణ సాయి పేరిట ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. అటు.. మూడో కూటమి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసిన కేసీఆర్.. రాంచీకి వెళ్లారు. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటులో భాగంగా వివిధ రాష్ట్రాలు పర్యటిస్తున్న కేసీఆర్.. జార్ఖండ్ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.
జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో కేసీఆర్ భేటీ అవుతారు. ప్రాంతీయ పార్టీలతో జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు విషయంపై జార్ఖండ్ సీఎంతో కేసీఆర్ చర్చిస్తారని సమాచారం. అలాగే పలు అంశాలపై ఈ ఇద్దరు మాట్లాడుకోనున్నారు. సోరెన్‌తో కలిసి లంచ్ చేసిన తర్వాత కేసీఆర్ హైదరాబాద్ తిరిగి వస్తారు. జేఎంఎం అధ్యక్షుడైన హేమంత్ సొరేన్ 2018 మార్చిలో కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు.
మరోవైపు, కేసీఆర్ మార్చి 14 తర్వాత ఢిల్లీ వచ్చి ప్రాంతీయ పార్టీల అధినేతల సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. కాగా జార్ఖండ్ పర్యటనలో కేసీఆర్.. గాల్వాన్ అమరుల కుటుంబాలకు పది లక్షల పరిహారం అందించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com