Kerala : ఎగ్ మయోనీస్ పై బ్యాన్...

Kerala : ఎగ్ మయోనీస్ పై బ్యాన్...
కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం; ఇకపై రాష్ట్రంలో వెజ్ మయోనీస్ మాత్రమే లభ్యం.....


పచ్చి కోడిగుడ్లతో తయారైన మయోనీస్ ను కేరళ ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006ను ఉపయోగించి, జనవరి 13న కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణ జార్జ్ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం స్టేక్ హోల్డర్స్ తో జరిగిన మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. పచ్చి కోడిగుడ్లతో తయారైన మయోనీస్ ను సకాలంలో ఉపయోగించకపోతే ఆరోగ్యానికి చాలా ప్రమాదమని మంత్రి తెలిపారు.

బేకరీలు, రెస్టారెంట్లు, హోటల్స్ ప్రతినిధుల సమావేశంలో మంత్రి జార్జ్ తీసుకున్న నిర్ణయానికి పూర్తి మద్దతు లభించింది. మయోన్నైస్ బదులుగా తాజా కూరగాలతో తయారైన మయోనీస్ ను వాడుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు.

మయోనీస్ తినే వ్యక్తుల నుంచి ఇప్పటికే పలు ఫిర్యాదులు అందాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. సరైన పాశ్చరైజేషన్ లేకుండా ఉంచినట్లయితే, అది సాల్మోనెల్లా బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుందని చెప్పారు. ఇది ఆరోగ్యకరమైన వ్యక్తుల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపెడుతుందని, పేగులను ప్రభావితం చేస్తుందని అన్నారు.


ఇక ఫుడ్ ప్యాకెట్లపై తేదీ, సమయం, గడువు తేదీని తెలిపే స్టిక్కర్లు తప్పనిసరిగా ఉండాలని ఆరోగ్య శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. కొట్టాయంకు చెందిన రేష్మి (33) అనే నర్సు జనవరి 3న ఫుడ్ పాయిజన్ తో మృతి చెందిన నేపథ్యంలో తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి.

Tags

Read MoreRead Less
Next Story