Kerala: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తండ్రి...

కేరళకు చెందిన టాన్స్ జంట పండండి బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తండ్రి, బిడ్డల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవలే కేరళకు చెందిన ట్రాన్స్ జంట ఫొటోషూట్ తో తమ ప్రెగ్నెన్సీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశ చరిత్రలో తొలిసారి ఓ టాన్స్ పురుషుడు గర్భం ధరించడం సంచలనంగా మారింది. పుట్టుకతో అమ్మాయి అయిన జాహద్, శస్త్ర చికిత్స అనంతరం పురుషుడిగా మారాడు. కానీ, బిడ్డను జన్మనివ్వాలన్న ఆలోచనతో గర్భసంచి తొలగించకుండా అలానే ఉంచుకున్నాడు. దీంతో తన సహచరి అయిన జియాతో బడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఇటీవలే వీరి పెగ్నెన్సీ షూట్ వైరల్ అవ్వగా, ప్రస్తుతం జాహద్ పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం 9.30 మధ్యలో సీ సెక్షన్ ద్వారా జాహద్ బుజ్జాయికి జన్మనిచ్చాడని తెలుస్తోంది. ప్రభుత్వ వైద్య పాఠశాలలో సీ- సెక్షన్ ద్వారా బుజ్జాయ జన్మించగా, ప్రస్తుతానికి బుజ్జాయి జెండర్ రివీల్ చేసేందుకు తల్లిదండ్రులు ఇష్టపడటంలేదని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com