శభాష్ శాన్వీ.. పదేళ్ల వయసుకే ఛెఫ్‌గా రికార్డు..

శభాష్ శాన్వీ.. పదేళ్ల వయసుకే ఛెఫ్‌గా రికార్డు..
పదేళ్ల చిన్నారి పాక శాస్త్రంలో ప్రావిణ్యురాలై గంటలో 30 రకాల వంటలు వండి

అమ్మా.. నాకు బుల్లి దోశలు కావాలి.. నేనే వేసుకుంటా అంటే చాలు చాల్లే.. స్టౌ దగ్గర ఆటలా.. వెళ్లి కూర్చో చేసిపెడతా.. తింటే అంతే చాలు అని అమ్మ వంటింట్లోకి వచ్చిన చిన్నారిని నాలుగు తగిలించి తరిమేస్తుంది. గరిటె తిప్పాలని ఉత్సాహంగా ఉన్నా అమ్మ తిట్టేసరికి ఆ ఛాయలకు కూడా వెళ్లరు పిల్లలు. మరి ఈ పదేళ్ల చిన్నారి పాక శాస్త్రంలో ప్రావిణ్యురాలై గంటలో 30 రకాల వంటలు వండి రికార్డుల కెక్కింది. కేరళకు చెందిన శాన్వి ఎం ప్రాజిత్ వింగ్ కమాండర్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రాజిత్ బాబు కూతురు.

ఊతప్ప, ప్రైడ్ రైస్, చికెన్ రోస్ట్ లాంటి వంటలన్నీ ఒకే చోట గంట సమయంలో తయారు చేసి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది. పిల్లల పేరుతో ఇలా ఓ రికార్డు నమోదవ్వడం ఇదే తొలిసారి. ఇలా ఈ ఏడాది ఆగస్ట్ 29న 10 సంవత్సరాల 6 నెలల 12 రోజుల వయసున్న శాన్వి విశాఖపట్నంలోని తన ఇంట్లో వంట చేస్తుండగా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అథారిటీ దీనిని ఆన్‌లైన్‌లో పర్యవేక్షించింది. ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్ల సారథ్యంలో చిన్నారి శాన్వి గరిటె తిప్పి గంటలో 30 వంటలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.

ఈ సందర్భంగా శాన్వి మాట్లాడుతూ.. అమ్మ నాకు హెల్ప్ చేసింది. అమ్మ కూడా స్టార్ చెఫ్.. దాంతో నాకూ వంటల మీద ఆసక్తి పెరిగింది. అమ్మ చేస్తుంటే నేను చూసి నేర్చుకున్నాను. అని తెలిపింది. శాన్వి చిల్డ్రన్ కుకరీ షోలో చాలా సార్లు పాల్గొంది. ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా నిర్వహిస్తూ రుచికరమైన వంటలు రెసిపీలను ఫాలోవర్లతో పంచుకుంటుంది.

Tags

Next Story