శబరిమల అయ్యప్పను దర్శించుకున్న గవర్నర్ మహ్మద్‌ఖాన్

హిందూ, ముస్లిం భాయి భాయి.. దేవుడు ఒక్కడే అన్ని మత గ్రంధాలు చెబుతున్నాయి. కానీ ఎవరి మతం వారిది. ఎవరి ఆచార వ్యవహారాలు వారివి. అయితే శబరిమలలో కొలువైన అయ్యప్ప హిందూ, ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలుస్తారు.
కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఆదివారం సాయంత్రం శబరిమలను సందర్శించారు. పంప గణపతి ఆలయంలో ఇరుముడిని ధరించిన ఆయన స్వామి అయ్యప్ప మందిరానికి రోడ్డు వెంట నడుస్తూ సన్నిధానానికి చేరుకున్నారు.
మలయాళ మాసం ఎనిమిది రోజుల విషు పండుగ ఆచారాల కోసం శనివారం సాయంత్రం ఈ ఆలయాన్ని ప్రారంభించారు. మెల్సంతి జయరాజ్ పొట్టి శనివారం 17:00 గంటలకు తంత్రీ కందరారు రాజీవారు సమక్షంలో ఆలయ శ్రీకోవిల్‌ను ప్రారంభించారు.
పడిపూజ తరువాత, ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ 18 మెట్లు ఎక్కి అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. తరువాత గవర్నర్ మాలికప్పురం ఆలయ ప్రాంగణంలో గంధపు చెట్టు మొక్కను నాటారు. ఆ తరువాత పుణ్యం పూంకవనం ప్రాజెక్టులో భాగంగా అక్కడే జరిగే కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తరువాత పంపకు తిరిగి వెళ్లారు. గవర్నర్‌తో పాటు అతని చిన్న కుమారుడు కబీర్ మహ్మద్ ఖాన్ ఉన్నారు.
అరిఫ్ ఖాన్ శబరిమల వెళ్లిన పొటోలను గవర్నర్ ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు రాజ్ భవన్ అధికారులు. కాగా ఆలయం ఏప్రిల్ 18 వరకు తెరిచి ఉంటుంది. కోవిడ్ సెకండ్ వేవ్ కారణం భక్తులు కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలి. కోవిడ్ 19 ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే అనుమతిస్తారు. స్వామివారం దర్శనం చేసుకోవాలనుకున్న భక్తులు ఆనలైన్‌లో టికెట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com