Kerala: ఇద్దరు వ్యక్తులు నన్ను లైంగికంగా.. : కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్

Kerala: ఇద్దరు వ్యక్తులు నన్ను లైంగికంగా.. : కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్
Kerala: కళ్లు కామంతో మూసుకుపోయిన వారు అభం శుభం తెలియని చిన్నపిల్లలను కూడా ఆ దృష్టితోనే చూస్తారు..

Kerala: కళ్లు కామంతో మూసుకుపోయిన వారు అభం శుభం తెలియని చిన్నపిల్లలను కూడా ఆ దృష్టితోనే చూస్తారు.. ఒకటవతరగతి చదువుతున్నప్పుడే తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు కేరళ పతనంతిట్ట కలెక్టర్ డా. దివ్య ఎస్ అయ్యర్.. 'ఇద్దరు మనుషులు నన్ను ఆప్యాయంగా దగ్గరికి పిలిచారు. నా బట్టలు విప్పినప్పుడు బాధ కలిగింది’’ అని కలెక్టర్ చెప్పారు. మీడియా కార్యకర్తలకు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ఇద్దరు వ్యక్తులను తన జీవితంలో మర్చిపోలేనని చెప్పారు. వారు చేసిన అన్యాయం తలచుకున్నప్పుడల్లా నా గుండె ద్రవిస్తుంది. ఆవేదనతో బరువెక్కుతుంది అని పేర్కొన్నారు. ఇద్దరు మనుషులు నన్ను ఆప్యాయంగా దగ్గరికి పిలిచారు. తెలిసీ తెలియని వయసు. ప్రేమగా పిలుస్తున్నారనుకున్నాను. నా బట్టలు విప్పి నన్ను తడమడానికి ప్రయత్నించారు. కానీ నేను ఏడ్చుకుంటూ అక్కడి నుంచి పరిగెట్టాను. వాళ్ళు ఎందుకు ముట్టుకుంటున్నారో నేను గుర్తించలేకపోయాను.

నా తల్లిదండ్రులు ఇచ్చిన మానసిక మద్దతు వల్లనే నేను ఆ బాధ నుంచి కోలుకోగలిగాను. ఎప్పుడైనా నేను జనంలోకి వచ్చినప్పుడు అందరి పైనా ఒక కన్ను వేసి ఉంచుతాను. ఆ రెండు ముఖాలు ఎక్కడైనా కనిపిస్తాయేమోనని వెతుకుతుంటాను అని దివ్య ఎస్ అయ్యర్ తెలిపారు. ఈరోజు దీనిపై మాట్లాడటం సిగ్గుచేటని కలెక్టర్‌ అన్నారు. మంచి స్పర్శ మరియు చెడు స్పర్శలను గుర్తించడం పిల్లలకు నేర్పించాలి. సీతాకోక చిలుకల్లా ఆటలాడుకోవాల్సిన వయసులో వారిని మానసిక క్షోభకు గురిచేయడం బాధాకరం. పిల్లల విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story