Kerala RTC Strike: కేరళలో బస్సులు బంద్.. సీఎం ఇచ్చిన హామీ మాటలకే పరిమితమంటున్న కార్మికులు..

X
Kerala RTC Strike (tv5news.in)
By - Divya Reddy |5 Nov 2021 4:15 PM IST
Kerala RTC Strike: వేతన సవరణ కోరుతూ సమ్మెకు పిలుపునిచ్చారు కేరళ ఆర్టీసీ కార్మికులు.
Kerala RTC Strike: వేతన సవరణ కోరుతూ సమ్మెకు పిలుపునిచ్చారు కేరళ ఆర్టీసీ కార్మికులు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. నిన్న రాత్రి నుంచి సమ్మె పిలుపు అమల్లోకి వచ్చింది. 9 ఏళ్లుగా వేతన సవరణ చేపట్టలేదని చెప్తున్నారు కార్మికులు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మాటలకే పరిమితమైందంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దక్షిణ కేరళలో సమస్య మరింత ఎక్కువగా ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com