ఆటో డ్రైవర్ అదృష్టం.. లాటరీలో రూ .12 కోట్లు..

ఆటో డ్రైవర్ అదృష్టం.. లాటరీలో రూ .12 కోట్లు..
X

జీవితాంతం కష్టపడ్డా 12 కోట్లు కాదు కదా 12 లక్షలు కూడా సంపాదించలేడు.. అతడు నడిపేది ఓ ఆటో.. విమానం కూడా కాదు.. చాలీచాలని సంపాదనంతో పూట గడవడమే కష్టంగా ఉంటుంది. ఇంకేం వెనకేస్తాడు. అందరూ కొంటున్నారని అతడూ కొన్నాడు.. అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకున్నాడు కేరళ కొచ్చికి చెందిన ఆటో డ్రైవర్.

అతడు రూ .12 కోట్ల విలువైన ఓనం బంపర్ కేరళ లాటరీని గెలుచుకున్నాడు. ఈ ఏడాది కేరళ ఓనమ్ బంపర్ లాటరీ విజేత కొచ్చిలోని మరడు పూప్పనపరంబిల్ హౌస్ నివాసి జయపాలన్ పిఆర్. జయపాలన్ మరాడులోని అంబేద్కర్ జంక్షన్ ఆటో స్టాండ్‌లో ఆటో డ్రైవర్. అతను కొట్టారం భగవతి దేవాలయం సమీపంలో నివసిస్తున్నాడు. కన్నన్ అని పిలవబడే, జయపాలన్ తన కుటుంబాన్ని చూసుకుంటాడు. అతడికి తల్లి 95 ఏళ్ల లక్ష్మీ బాయి, భార్య మణి, ఇద్దరు కుమారులు వైశాఖ్ మరియు విష్ణు ఉన్నారు.

జయపాలన్ భార్య మణి చోట్టనిక్కర హోమియో ఆసుపత్రిలో స్వీపర్‌గా పనిచేస్తుండగా, వైశాఖ్ ఎలక్ట్రీషియన్‌గా, విష్ణు హోమియో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. లాటరీ ద్వారా అతడు గెలుచుకున్న రూ.12 లక్ష్లల్లో పన్నులు, ఏజెంట్ కమీషన్ పోను జయపాలన్ సుమారు రూ .7.39 కోట్లు పొందవచ్చు.

ఆ డబ్బుతో "తాను అంతకు ముందే తీసుకున్న వాహన రుణం, గృహ రుణ తీర్చేస్తానంటున్నాడు. నా కుటుంబంతో చర్చించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ఏం చేయాలో నిర్ణయించుకుంటాను అని చెబుతున్నాడు. తిరువోనం బంపర్ బిఆర్ -81 లాటరీ ఫలితం ఆదివారం ప్రకటించబడింది. ఈ ఏడాది మొత్తం 54 లక్షల ఓనం బంపర్ లాటరీ టిక్కెట్లు రూ .126.5 కోట్లకు అమ్ముడయ్యాయి. టికెట్ ధర రూ. 300.

Tags

Next Story