Kerala Trans Couple: తండ్రి గర్భధారణ

Kerala Trans Couple: తండ్రి గర్భధారణ
తల్లిదండ్రులు అవ్వబోతున్న ట్రాన్స్ జంట; పవర్ ఫుల్ ఫొటోషూట్...

ఓ ట్రాన్స్ జంట తల్లిదండ్రులవుతున్న అరుదైన ఘటన కేరళలో చోటుచేసుకుంది. దీంతో జాహద్, జియా ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్ గా మారారు. కాజికోడ్ కు చెందిన ఈ టాన్స్ జంట తమ ప్రెగ్నెన్సీ ఫొటోషూట్ ద్వారా సమాజానికి బలమైన సందేశాన్ని పంపాలని నిర్ణయించుకున్నారు. వారు అనుకున్నట్లుగానే ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. జన్మతః పురుడైన జియా టాన్స్ సర్జరీ అనంతరం స్త్రీగా మారగా, జన్మతః స్త్రీ అయిన జాహద్ ఆపరేషన్ అనంతరం పురుషుడిగా మారాడు. గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జంట తాజాగా తల్లిదండ్రులు అవ్వబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ మేరక్ గర్భం దాల్చిన జాహద్ మార్చ్ లో బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story