Khalistan : ఖలిస్థాన్ అనుకూల 6 యూట్యూబ్ ఛానల్స్ బ్యాన్

Khalistan : ఖలిస్థాన్ అనుకూల 6 యూట్యూబ్ ఛానల్స్ బ్యాన్


ఖలిస్థాన్ అనుకూల యూట్యూబ్ ఛానల్లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. కనీసం ఆరు యూట్యూబ్ ఛానల్లను బ్లాక్ చేసినట్లు శుక్రవారం అధికారులు ప్రకటించారు. ఈ యూట్యాబ్ ఛానల్లు విదేశాల నుంచి పనిచేస్తూ స్థానిక యువతను తీవ్రవాదం వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయని చెప్పారు. ఆరు నుంచి ఎనిమిది యూట్యూబ్ ఛానల్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. పంజాబీ భాషలో కంటెంట్ ఉన్న ఛానెల్లు సరిహద్దు రాష్ట్రంలో ఇబ్బందులను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు.


తీవ్రవాద బోధకుడు, ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్ తన మద్దతుదారులలో ఒకరిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కత్తులు, తుపాకీలతో అజ్నాలాలోని పోలీస్టేషన్ పై దాడి చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యకు పూనుకుంది. 48గంటల్లో ఛానల్స్ ను బ్యాక్ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై యూట్యూబ్ చర్యలు తీసుకుందని అధికారులు తెలిపారు. అభ్యంతరకరమైన కంటెంట్ ను ఆటోమేటిక్ గా గుర్తించి బ్లాక్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అల్గారిథమ్ ను ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం యూట్యూబ్ కు తెలిపిందని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story