సారీ.. తప్పుగా మాట్లాడాను: కుష్బూ

కాంగ్రెస్ పార్టీపై తాను చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణ కోరుతున్నారు బీజేపీ మహిళా నేత, నటి కుష్బూ. ఆమె చేసిన వ్యాఖ్యలపట్ల తమిళ ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమయింది. ఆమె మీద ఓ హక్కుల సంస్థ ఏకంగా 30 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె తాను చేసిన తప్పును తెలుసుకున్నారు.. క్షమించమని కోరుతూ ఇక ముందు ఇలాంటి పొరపాటు జరగకుండా చూస్తానని అన్నారు. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కుష్బూ సడెన్‌గా పార్టీ మార్చారు బీజేపీలో చేరారు.
ఆ పార్టీలో చేరిన అనంతరం ఈ నెల 14న కుష్బూ చెన్నై వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కుష్బూ కాంగ్రెస్ పారీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మానసిక ఎదుగుదల లేని పార్టీ అని, నాయకులకు కూడా బుర్ర తక్కువ అంటూ మాట్లాడారు. తమిళ ప్రజల ఆగ్రహానికి గురైన కుష్బూ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. ఆ సమయంలో నేను తీవ్ర దుఖంలో ఉన్నాను. ఆ తొందరపాటులో రెండు పదాలు తప్పుగా వాడాను. నాకు నేనుగా ఎదిగిన వ్యక్తిని.. అలాంటిది నేను వేరే వాళ్ల డైరెక్షన్‌లో వారి ఆలోచనల మేరకు మాట్లాడుతున్నాను అనడం కరెక్ట్ కాదు.. క్షమించండి అని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com