మాస్కుని మళ్లీ వాడేద్దామిలా..

మాస్కుని మళ్లీ వాడేద్దామిలా..
కరోనా వచ్చింది మాస్కుల వాడకం పెరిగిపోయింది. దీంతో ఎక్కడ చూసినా మాస్కుల అమ్మకాలు జరుగుతున్నాయి. మిగిలిన

కరోనా వచ్చింది మాస్కుల వాడకం పెరిగిపోయింది. దీంతో ఎక్కడ చూసినా మాస్కుల అమ్మకాలు జరుగుతున్నాయి. మిగిలిన సాధారణ మాస్కులకంటే ఎన్-95 మాస్క్ రేటు ఎక్కువే. ఈ మాస్క్ వైరస్ ని రక్షించడంలో సమర్థవంతంగా పని చేస్తుందని పేరు తెచ్చుకుంది. మరి దీన్ని ఒకసారి వాడి పడేయాలంటే మనసొప్పదు. శుభ్రపరిచి తిరిగి వాడుకునే అవకాశం వస్తే.. మాస్క్ ని శానిటైజ్ చేయడానికి అనేక పద్దతులు ఉన్నాయి. అందులో మనకి ఈజీగా ఉండేది ఇంట్లో వాడే ప్రెషక్ కుక్కర్ లో మాస్క్ ఉంచి నలభై నిమిషాలు సిమ్ లో స్టౌపై పెడితే పూర్తిగా పరిశుభ్రమై కొత్త మాస్క్ లా మారిపోతుందని పరిశోధకులు తేల్చారు. ఎలక్ట్రిక్ కుక్కర్ ఉంటే అందులో కూడా ఇలానే 45 నిమిషాలు ఉంచితే కొత్త మాస్క్ లా మళ్లీ దాన్ని వాడుకోవచ్చు. ఆల్ట్రావైలెట్ కాంతిని ఉపయోగించి ఎన్-95 మాస్క్ లను క్లీన్ చేస్తుంటారు. అయితే ఆ సైంటిఫిక్ పద్ధతి కంటే సులువైన ఈ ప్రెషర్ కుక్కర్ పద్దతి ప్రభావంతంగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు.

Tags

Next Story