Sri Lanka: ద్యావుడా.. గాలిపటంతోపాటు 30 అడుగుల పైకి..

Sri Lanka: అందరికంటే తన గాలిపటమే పైకి ఎగరాలనుకున్నాడు.. తనే గాలిపటంతో పాటు పైకి వెళ్తానని అనుకోలేదు.. అదృష్టం బావుండి అంతెత్తు పైకి వెళ్లి కిందపడ్డా క్షేమంగా బయటపడ్డాడు.. ఈ వింత ఘటన శ్రీలంకలో చోటు చేసుకుంది.
జాఫ్నాలోని పాయింట్ పెడ్రోలో గాలిపటాలు ఎగువేస్తున్నారు అక్కడి ప్రజలు తై పొంగల్ పండుగలో భాగంగా.. ఈ క్రీడలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు. గేమ్‌లో భాగంగా కొంతమంది క్రీడాకారుల బృందం కలిసి గాలిపటం ఎగురవేస్తోంది.. బృందంలోని సభ్యులు గాలిపటం యొక్క దారాన్ని విడిచి పెట్టినా అందులోని ఓ వ్యక్తి మాత్రం అలానే పట్టుకున్నాడు.. ఆకాశం అంచులను తాగుతున్నట్లుగా గాలిలో దూసుకుపోతున్న గాలిపటం దారాన్ని పట్టుకునే ఉన్న వ్యక్తిని లాగేసింది.
నేల మీద నుంచి దాదాపు 30 అడుగుల ఎత్తులో ఆ వ్యక్తి ఎగిరాడు.. చుట్టూ ఉన్న స్నేహితులు ఏం జరుగుతుందో అర్థంకాక పిచ్చిగా అరిచారు. జనం అంతా గుంపులుగా చేరి అరవడం ప్రారంభించారు. గాలిలోకి ఎగిరిన వ్యక్తి ఒక్క నిమిషంలో దబ్బున నేల మీద పడ్డాడు. ఒక్క క్షణం ఊపిరి ఆడలేదు. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డ అతడు చచ్చి బతికానని ఊపిరి పీల్చుకున్నాడు.. ఈ దృశ్యం కెమెరా కంటికి చిక్కడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com