పానీపూరీ తినడానికి వెళుతున్నారా.. ఓసారి ఆలోచించకూడదు..

పానీపూరీ తినడానికి వెళుతున్నారా.. ఓసారి ఆలోచించకూడదు..
పానీలో చేయి ముంచీ తీస్తూ వరుసగా ఓ పది మందికైనా పెట్టగల నేర్పరులు బండి నిర్వాహకులు..

వీధికో పానీ పూరీ బండి.. కరోనా వచ్చి గోల్గప్ప తినే వారు గప్‌చుప్‌గా ఉండవలసి వస్తోంది. అయినా అక్కడక్కడా కనబడుతున్న బండ్లు పానీపూరీ ప్రియులను ఊరిస్తున్నాయి.. ఎవరెన్ని చెప్పినా.. అమ్మ వద్దని వారించినా.. సాయింత్రమైతే చాలు పానీ పూరీ బండివైపే అడుగులు పడుతుంటాయి.. పానీలో చేయి ముంచీ తీస్తూ వరుసగా ఓ పది మందికైనా పెట్టగల నేర్పరులు బండి నిర్వాహకులు..

పానీ కుండ ఏమీ అమృత బాంఢాగారం కాదు. అయిపోయినా నిండుతుండడానికి అందుకే పక్కనే కనబడుతున్న పబ్లిక్ టాయ్‌లెట్‌లో వాటర్ పట్టి పానీ తయారు చేశాడు మహారాష్ట్రలోని కొల్హాపూరీ పానీ పూరి వాలా.. పైగా తన బండికి 'ముంబైకే స్పెషల్ పానీ పూరీ వాలా' అని పేరు కూడా పెట్టుకున్నాడు.

ఈ దృశ్యాన్ని ఒకరిద్దరు కస్టమర్లు చూశారు.. వీరలెవల్లో ఉతికి ఆరేశారు.. జనం ఆరోగ్యంతో ఆటలాడుకుంటావా అని అతడి కష్టాన్ని నేల పాలు చేశారు.. పానీ పూరీ వాలా రోడ్డున పడ్డాడు.. నిజానికి ఇలాంటి దృశ్యాలు ఎక్కడో ఒక చోట రోజూ దర్శనమిస్తూనే ఉంటాయి.. అయితే అవి కెమెరాకు చిక్కక పోవడంతో వారి వ్యాపారం సాగుతోంది.

ఏదేమైనా అసలే కరోనా కాలం.. శుభ్రంగా ఉంటేనే వైరస్ ఎట్నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. పానీపూరీ అమ్ముకునే వారికీ అదే జీవనాధారం.. కాస్త శుభ్రత పాటిస్తూ వ్యాపారం చేసుకుంటే జనం పానీ పూరీ బండి ముందు క్యూ కట్టడం గ్యారెంటీ.

సికింద్రాబాద్ స్టేషన్‌లోని చెన్నై సెంట్రల్-హైదరాబాద్ చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు టాయిలెట్ నీటితో చేసిన టీ, కాఫీ వడ్డించినందుకు వెండింగ్ కాంట్రాక్టర్‌కు 2018 లో రైల్వే శాఖ లక్ష రూపాయల జరిమానా విధించింది.

Tags

Read MoreRead Less
Next Story