సిమెంట్ ట్యాంకుల్లో కొర్రమీను చేపల పెంపకం

సౌదీ వెళ్లిన షేక్ సలీం అక్కడ స్నేహితుడు చేస్తున్న కొర్రమీను చేపల పెంపకాన్ని నేర్చుకున్నాడు.. స్వదేశానికి తిరిగి వచ్చి తాను అదే పద్దతిలో చేపల పెంపకాన్ని ప్రారంభించాడు. తెలంగాణ జనగామ జిల్లాకు చెందిన దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన సలీం ఇంటర్ వరకు చదువుకున్నాడు. 23 ఏళ్ల క్రితం సౌదీ వెళ్లాడు. స్నేహితుడొకరు వ్యవసాయ క్షేత్రంలో పని చేస్తున్నాడని తెలిసి సెలవు రోజుల్లో తానూ వెల్లి వారి సాగు పద్ధతులను పరిశీలిస్తూ ఉండేవారు. అక్కడే సిమెంటు ట్యాంకుల్లో చేపల పెంపకం నేర్చుకున్నారు.
కొద్ది నెలల క్రితం ఇంటికి తిరిగి వచ్చిన సలీం దేవరుప్పులలో అరెకరం స్థలంలో ఆరు సిమెంటు ట్యాంకులను నిర్మించారు. మొత్తం 6 ట్యాంకుల్లో 36,000 కొర్రమీను పిల్లలను వదిలారు. ఏడాదికి కిలో బరువు పెరుగుతాయని అంటున్నారు. పల్లీ చెక్క, గౌడును కలిపి తగిన తేమతో వారం రోజులు ట్రేలలో ఉంచితే పురుగులు తయారవుతాయి. వాటినే కొర్రమీను చేపలకు ఆహారంగా వేస్తారు. ట్యాంకు పై కప్పు సగం మూసి ఉంటే, ట్యాంకులో నీటి ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడం వీలవుతుందని ఆయన చెబుతున్నారు. రీసర్క్యులేటరీ పద్ధతిలో చేపట ట్యాంకులోని నీటితోనే కూరగాయల సాు చేయాలని ఆలోచిస్తున్నట్లు సలీం చెప్పారు.
రెండు నెలలు సిమెంటు ట్యాంకుల్లో 8-10 అంగుళాల సైజు వరకు పెంచిన తర్వాత రైతులకు మట్టి చెరువుల్లో పెంపకానికి అమ్ముతానని సలీం తెలిపారు. తనతో పాటు తోటి రైతులు కూడా కొర్రమీను చేపలు పెంచి మంచి ఆదాయం గడించాలన్నదే తన అభిమతమని ఆయన తెలిపారు.
అరెకరం స్థలంలో 32 సిమెంటు తొట్లలో చేపల పెంపకానికి దాదాపు 65 లక్షల రూపాయలు ఖర్చయిందన్నారు. సహజ పద్దతిలో చేస్తున్న కొర్రమీను సాగ.. ఏడాదిలో కిలో సైజుకు పెంచి బతికున్న చేపలనే అమ్మితే మంచి ఆదాయం వస్తుంది. సిమెంటు ట్యాంకుల్లో కొర్రమీను పెరగదని అందరూ అంటారు. అయినా ఆ మాటల్ని పట్టించుకోకుండా సాగు చేస్తున్నానని సలీం అంటారు. కొర్రమీను ఏ కాలంలో అయినా మంచి గిరాకీ ఉంటుంది అని అన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com