కృష్ణా జలాల వివాదం..పిటిషన్‌ను మరో ధర్మాసనానికి బదిలీ చేసిన సీజేఐ

Krishna River Water Issue: ఏపీ, తెలంగాణ నీటి పంచాయితీపై సుప్రీం కోర్టు దృష్టి సారించింది. కృష్ణా జలాల వివాదంలో ఏపీ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఐతే.. మధ్యవర్తిత్వం అవసరం లేదని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. న్యాయపరంగానే వివాదాలను పరిష్కరించుకుంటామని స్పష్టం చేసింది. దీంతో.. ఏపీ పిటిషన్‌ను సీజేఐ ఎన్వీ రమణ మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. సీజేఐ ధర్మాసనం విచారణ చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తిని సీజేఐ నిరాకరించారు.
గత విచారణ సందర్భంగా... తాను రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినని.. తెలుగు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం ద్వారా వివాదం పరిష్కారానికి సిద్దపడినట్లైతే సమాఖ్య స్పూర్తికి, రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఈ వివాద పరిష్కారానికి తోడ్పాటునందిస్తానని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. అలా కాకుండా కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతరుల జోక్యంతో న్యాయపరంగా దీన్ని పరిష్కరించుకోవాలనుకుంటే ఈ కేసు విచారణను మరొక ధర్మాసనానికి బదిలీ చేస్తానని అన్నారు. మధ్యవర్తిత్వం ఆమోదయోగ్యమైతేనే తాను ఈ విషయంపై విచారణ చేపడతానని అన్నారు. ఐతే.. మధ్యవర్తిత్వం అవసరం లేదని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పడంతో.. పిటిషన్‌ను మరో ధర్మాసనానికి బదిలీ చేశారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com