Kuldeep Mother: నా కోడల్ని కూడా ఆర్మీలోకి పంపుతా: కొడుకు పోయిన దు:ఖంలోనూ ఓ తల్లి దేశభక్తి..

Kuldeep Mother: నా కోడల్ని కూడా ఆర్మీలోకి పంపుతా: కొడుకు పోయిన దు:ఖంలోనూ ఓ తల్లి దేశభక్తి..
Kuldeep Mother: కులదీప్ మరణ వార్త తెలిసిన రాత్రి ఊరంతా పొయ్యి వెలిగించలేదు. గంటలో గ్రామం మొత్తం అమరవీరుడి కుటుంబంతో ఉంది.

Kuldeep Mother: తమిళనాడులోని కూనూర్‌లో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్ సహా 13 మంది మరణించారు. ఈ ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డారు. అతను తీవ్రంగా కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి.

ఈ విషాద ఘటనలో రాజస్థాన్‌లోని ఝంఝుం నివాసి కులదీప్ సింగ్ రావు కూడా వీరమరణం పొందారు. అతను సైన్యంలో స్క్వాడ్రన్ లీడర్. రెండు రోజులుగా ఆయన ఇంట్లో విషాద వాతావరణం నెలకొంది. బంధువులు, చుట్టుపక్కల వారి రాకపోకలతో ఆ ప్రాంతమంతా రద్దీగా ఉంది. కులదీప్ కుటుంబాన్ని ఓదార్చేందుకు ఊరంతా తరలివస్తోంది.

కుల్దీప్ తల్లి కమలా దేవి కొడుకు పోయిన దు:ఖంలో కళ్లు చెమరుస్తూనే తన కొడుకు పట్ల గర్వంగా ఉన్నారు. వందేమాతరం అంటూ నినాదాలు చేస్తూ.. నా కొడుకు అమరవీరుడయ్యాడు. ఇది నా కొడుకు సంపాదన. దేశానికి సేవ చేస్తూనే నా కొడుకు అమరుడయ్యాడు. ఇప్పుడు నేను నా కోడలిని కూడా సైన్యంలోకి పంపిస్తాను. ఇది నా తదుపరి కర్తవ్యం అవుతుంది అని ఆమె భావోద్వేగంతో అన్న మాటలు అక్కడి వారి రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాయి.

అమరవీరుడు కుల్దీప్ బంధువు రాజేంద్రరావు కూడా నేవీలో ఉద్యోగం చేస్తున్నారు. అతను ఇప్పుడు రిటైర్ అయ్యాడు. కుల్‌దీప్‌కి చిన్నప్పటి నుంచి పైలట్‌ కావాలనే కోరిక ఉండేదని రాజేంద్ర చెప్పారు. చిన్నప్పుడు ఎప్పుడూ బొమ్మ విమానం చేతిలో పెట్టుకుని తిరిగేవాడు. ఏదో ఒక రోజు కచ్చితంగా పైలట్‌ని అవుతానని చెప్పేవాడు. 7 నెలల క్రితం కులదీప్ తన కుటుంబంలోని మేనమామ అబ్బాయి పెళ్లి కోసం ఘర్దానా ఖుర్ద్ అనే గ్రామానికి వచ్చాడని రాజేంద్ర చెప్పారు. అతడు తన పాఠశాలకు కూడా వెళ్ళాడు. అక్కడ పిల్లలను కలుసుకున్నాడు

సైన్యంలో చేరమనికి వారిని ప్రేరేపించాడు. ప్రస్తుతం కులదీప్ కుటుంబం జైపూర్‌లో నివసిస్తోంది. ఘటన గురించి సమాచారం అందుకున్న వారంతా ఝుంఝును చేరుకున్నారు. శుక్రవారం అమరవీరునికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

గ్రామం మొత్తం కులదీప్‌ను చూసి గర్విస్తున్నామని గ్రామ మాజీ సర్పంచ్ హర్పాల్ సింగ్ తెలిపారని గ్రామస్తులు తెలిపారు. ఆయనకు అంతిమ వీడ్కోలు పలికేందుకు మా గ్రామం అంతా సిద్ధమైంది. గ్రామ ప్రియుడికి పూర్తి గౌరవంతో అంతిమ వీడ్కోలు ఇవ్వనున్నారు. కుల్‌దీప్‌ మృతి చెందినట్లు సమాచారం అందడంతో గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయిందని హర్పాల్ తెలిపారు.

కులదీప్ మరణ వార్త తెలిసిన రాత్రి ఊరంతా పొయ్యి వెలిగించలేదు. గంటలో గ్రామం మొత్తం అమరవీరుడి కుటుంబంతో ఉంది. కులదీప్‌కు తల్లి కమలా దేవి, భార్య యశ్వని ధాకా, సోదరి అభిత, తండ్రి రణధీర్ సింగ్ రావు అందరూ అతడి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాము. కుల్దీప్ రెండేళ్ల క్రితం మీరట్‌కు చెందిన యశ్వానిని వివాహం చేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story