Virtual Influencer Kyra: దేశంలో తొలి వర్చువల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌'కైరా'.. రోజుకు వెయ్యిమంది ఫాలోయర్లు..

Virtual Influencer Kyra: దేశంలో తొలి వర్చువల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌కైరా.. రోజుకు వెయ్యిమంది ఫాలోయర్లు..
Virtual Influencer Kyra: 21 ఏళ్ల కైరా వర్చువల్ దేశంలో తొలి వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్. కైరా అనేది టాప్ సోషల్ ఇండియాలో బిజినెస్ హెడ్ హిమాన్షు గోయెల్ యొక్క సృష్టి.

Virtual Influencer Kyra: 21 ఏళ్ల కైరా వర్చువల్ దేశంలో తొలి వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్. కైరా అనేది టాప్ సోషల్ ఇండియాలో బిజినెస్ హెడ్ హిమాన్షు గోయెల్ యొక్క సృష్టి.

26 ఏళ్ల హిమాన్షు గోయెల్ 2020లో ప్రాజెక్ట్‌ను రూపొందించినప్పటి నుండి దీనికి నాయకత్వం వహిస్తున్నాడు.

ఎవరీ కైరా .. ఏమా కథ

కైరా వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్. ఇది సోషల్ మీడియా ఖాతా కలిగి ఉన్న కల్పిత పాత్ర. కైరా ఖాతా కంటెంట్‌ని సృష్టించే బృందంచే నిర్వహించబడుతుంది. బ్రాండ్‌లతో సహకరిస్తుంది. కైరా డిసెంబర్ 2021లో సాఫ్ట్‌గా లాంచ్ చేయబడింది. అయితే అధికారికంగా ఆమె పుట్టిన తేదీ జనవరి 28, 2022.

కైరా యొక్క ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఆమెను "భారతదేశం యొక్క మొదటి మెటా-ఇన్‌ఫ్లుయెన్సర్"గా అభివర్ణించింది. ప్రస్తుతం రోజుకి 95,000 కంటే ఎక్కువ మంది ఫాలోయర్లు కలిగి ఉంది కైరా.

వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్ యొక్క అనుచరులలో 90 శాతం మంది భారతీయులు ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో నివసిస్తున్నారు.

గోయెల్ మాట్లాడుతూ "బ్రాండ్ మేనేజర్లు కైరా వర్చువల్ కంటే వాస్తవికంగా కనిపిస్తారని చెప్పారు." ఫేస్‌బుక్ తన పేరును మెటాగా మార్చుకున్నందున, వర్చువల్ స్పేస్ కాన్సెప్ట్ గురించి చాలా మందికి ఇప్పటికే తెలుసునని ఆయన తెలిపారు.

కైరా ఫోటోరియలిస్టిక్ వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్. ఆసియా, ఇండోనేషియా, జపాన్, చైనా దేశాలలో అత్యంత ప్రజాదరణ పొందిన వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఉన్నారు.

వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ అంటే కార్టూన్ క్యారెక్టర్స్ మాదిరిగానే ఉంటారు. కానీ అచ్చంగా మనుషుల్ని పోలి ఉంటారు. నడక, వస్త్రధారణ అంతా మనలాగే ఉంటుంది. వీరి దినచర్య సంస్థల వ్యాపార ప్రకటనలు, సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటారు.

కైరా పేరుతో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయడానికి ప్రత్యేక బృందం ఉంటుంది. బ్రాండ్ల ప్రచారంలో భాగంగా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ ఆ ప్రాంతం ఫోటోకి 3డి సహాయంతో కైరాను జతచేస్తారు. కైరాకు వయసు పెరగదు.. వివాదాలకు తావుండదు అని చెబుతున్నారు రూపకర్తలు.

పోస్టుల్లోని వీడియోలు, చాటింగుల్లో గలగలా మాట్లాడేస్తుంటే.. తెలియని వారు నిజంగా అమ్మాయే మాట్లాడుతుందని భ్రమ పడుతుంటారు. ఆమెకు మెసేజ్ లు పెడుతుంటారు. ఇటీవలే ఈ నిజాన్ని బయటపెట్టిన రూపకర్తలు.. మాట్లాడడం వరకు సరే కానీ ప్రేమలో పడకండి అని సలహా ఇస్తున్నారు.

Tags

Next Story