Labh Singh Ugoke : పంజాబ్‌‌ సీఎంని ఓడించిన మొబైల్ మెకానిక్..!

Labh Singh Ugoke : పంజాబ్‌‌ సీఎంని ఓడించిన మొబైల్ మెకానిక్..!
Labh Singh Ugoke : పంజాబ్‌‌లో అధికారాన్ని కోల్పోయింది కాంగ్రెస్... కేవలం 18 సీట్లు మాత్రమే గెలుచుకొని ఘోర ఓటమిని చవిచూసింది.

Labh Singh Ugoke : పంజాబ్‌‌లో అధికారాన్ని కోల్పోయింది కాంగ్రెస్... కేవలం 18 సీట్లు మాత్రమే గెలుచుకొని ఘోర ఓటమిని చవిచూసింది. ఇక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఘోర ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఆయన ఓడిపోయారు.. చమ్‌కౌర్ సాహిబ్, బదౌర్ స్థానాల నుంచి చన్నీ పోటీ చేయగా బదౌర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన లబ్‌‌సింగ్ ఉగోకే 57,000 ఓట్లకు పైగా సాధించగా, చన్నీకి కేవలం 23,000 పైగా ఓట్లు మాత్రమే వచ్చాయి. చన్నీపై 37,558 ఓట్ల తేడాతో విజయం సాధించారు లబ్‌‌సింగ్.

దీనితో ఎవరీ లబ్‌‌సింగ్ ఉగో అని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఆప్ భారీ విజయాన్ని సాధించిన తర్వాత పంజాబ్ ఓటర్లను ఉద్దేశించి పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు.. అందులో భాగంగానే చరణ్‌జిత్ సింగ్‌ను ఎవరు ఓడించారో తెలుసా? Labh Singh Ugoke defeats Charanjit Singh Channi in Bhadaur లబ్‌‌సింగ్ ఉగోకే అని చెప్పుకొచ్చారు కేజ్రివాల్. 35 ఏళ్ల లబ్‌‌సింగ్ ఉగోకే 1987లో జన్మించాడు.12వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత మొబైల్ ఫోన్ రిపేర్‌లో డిప్లొమా కోర్సును నేర్చుకున్నాడు. 2013లో ఉగోకే స్వచ్ఛందంగా ఆప్‌లో చేరారు. ఉగోకే తండ్రి డ్రైవర్ కాగా, అతని తల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్ గా పనిచేస్తోంది.

ఇక 2017లో బదౌర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆప్ అభ్యర్థి పిర్మల్ సింగ్ ధౌలా గెలుపొందారు. అయితే, ధౌలా గతేడాది కాంగ్రెస్‌లో చేరారు. ఈ సారి అక్కడినుంచి పోటీ చేసే అవకాశం లబ్‌‌సింగ్ ఉగోకే దక్కింది. ఇక ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని, పంజాబ్‌‌లో గెలిచిన ఆప్‌కు, భగవంత్‌‌ మన్‌‌కు అభినందనలని చన్నీ ట్వీట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story