జాతీయం

సరిహద్దుల్లో శత్రుదేశాలతో అమీతుమీకి సై అంటున్న భారత సైన్యం

సరిహద్దుల్లో శత్రుదేశాలతో అమీతుమీకి సై అంటున్న భారత సైన్యం
X

సరిహద్దుల్లో శత్రుదేశాలతో అమీతుమీకి సై అంటోంది భారత సైన్యం. అవసరమైతే యుద్ధానికీ సిద్ధంగా ఉండాలంటూ భద్రతాదళాలకు ఆదేశాలు వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా LAC వెంట తూర్పు లద్ధాఖ్‌లో చైనా తీరుతో తలెత్తిన తాజా పరిస్థితుల నేపథ్యమే ఈ సన్నద్ధతకు కారణంగా తెలుస్తోంది. సాధారణంగా క్యాంప్‌ల వద్ద 10 రోజులకు సరిపడ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి నిల్వ ఉంచుతారు. కానీ ఇప్పుడు 15 రోజులకు సరిపడ ఆయుధ సామాగ్రి రెడీగా ఉంచుకోవాల్సిందిగా ఆదేశాలు వెళ్లాయి. ఇలా నిల్వలు పెంచుకోవాలని ఆదేశాలు ఇవ్వడమే కాదు.. రక్షణ దళాలకు అవసరమైన ఆయుద్ధ సంపత్తి సమకూర్చుకునేందుకు, అవసరమైతే విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు ఇప్పుడు దాదాపు 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు.

త్రివిధ దళాలకు అవసరమైన రక్షణ సామాగ్రి కోసం యుద్ధ ట్యాంకులు, క్షిపణలు, యుద్ధ విమానాలు, మిసైళ్లు, మోర్టార్ల కొనుగోళ్లకు గ్రీన్‌సిగ్నల్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనాతోపాటు పాకిస్థాన్‌ నుంచి కూడా కవ్వింపులు పెరిగిన నేపథ్యంలో.. ఆ రెండు దేశాలకు గట్టి సమాధానం చెప్పేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. జల, వాయు, భూమి సరిహద్దుల్లో హైలెవెల్ ప్రిపరేషన్‌ను CDS రావత్ కూడా ధృవీకరించినట్టు వార్తలొస్తున్నాయి.

Next Story

RELATED STORIES