రియాకు మద్దతుగా మంచు లక్షి..

రియాకు మద్దతుగా మంచు లక్షి..
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కేసులో అందరూ రియా చక్రవర్తిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కేసులో అందరూ రియా చక్రవర్తిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ టాలీవుడ్ నటి మంచు లక్ష్మి మాత్రం రియాకు మద్దతు తెలుపుతున్నారు. ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియాలో #JusticeForSushantSinghRajput,#JusticeForRehaChakraborty అనే హ్యాష్ ట్యాగ్ తో లక్ష్మి ఓ పోస్ట్ పెట్టారు. రియా చక్రవర్తిని సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్ధేశాయ్ చేసిన ఇంటర్వ్యూ మొత్తం చూశాను. ఆ తర్వాత దీనిపై స్పందించాలా వద్దా అని ఓ క్షణం ఆలోచించాను. ఇప్పటికే ఆమెని అందరూ ఓ విలన్ లా చూస్తున్నారు. చాలా మంది ఈ ఇష్యూపై మాట్లాడడానికి సుముఖంగా లేరు. నాక్కూడా నిజం ఏంటో తెలియదు. నిజమేంటో నేనూ తెలుసుకోవాలనుకుంటున్నాను. అదే సమయంలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని నమ్ముతున్నా. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. సుశాంత్ కు న్యాయం జరిగేలా తీర్పు వస్తుందని భావిస్తున్నాను అని మంచు లక్ష్మి పేర్కొన్నారు.

Tags

Next Story