Lalu Prasad Yadav : దాణా స్కామ్ ఐదో కేసులోనూ దోషిగా తేలిన మాజీ సీఎం లాలూ ప్రసాద్

Lalu Prasad Yadav : దాణా స్కామ్‌లోని ఐదో కేసులోనూ దోషిగా తేలారు మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్. దాణా కుంభకోణంపై విచారణ జరుపుతున్న సీబీఐ స్పెషల్ కోర్టు.. లాలూ దోషి అంటూ తీర్పు ఇచ్చింది. దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్‌పై ఐదు కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే నాలుగు కేసుల్లో లాలూ ప్రసాద్ దోషిగా తేలారు. ఇప్పుడు ఐదో కేసులోనూ దోషి అంటూ తీర్పు వచ్చింది. బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాణా కుంభకోణం జరిగింది. డోరాండా ట్రెజరీ నుంచి 139 కోట్ల రూపాయలు అక్రమంగా విత్‌డ్రా చేశారంటూ లాలూపై అభియోగాలు ఉన్నాయి. 1990-1995 మధ్యకాలంలో కుంభకోణం జరగ్గా.. లాలూను 1997లో నిందితుడిగా చేర్చింది సీబీఐ. ఈ కేసులో లాలూ ప్రసాద్‌తో పాటు 110 మంది నిందితులు ఉన్నారని సీబీఐ తెలిపింది. ఈ కేసు విచారణలో భాగంగా 575 మంది సాక్షుల వాంగ్మూలం తీసుకున్నారు. 25 ఏళ్ల తరువాత సీబీఐ కోర్టు తుది తీర్పు ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com