Lalu Prasad Yadav: నాన్నా నువ్వే నా హీరో.. త్వరగా కోలుకోవాలి: లాలూ కుమార్తె ఎమోషనల్ పోస్ట్

Lalu Prasad Yadav: ఆసుపత్రిలో చేరిన లాలూ ప్రసాద్ యాదవ్‌ను చూసి కూతురు రోహిణి భావోద్వేగానికి గురవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. 'నా బ్యాక్‌బోన్ పాపా' అని రాసింది..
రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పాట్నాలోని ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులో చేరి చికిత్స పొందుతున్నారు. తండ్రి ఆసుపత్రిలో ఉన్న చిత్రాన్ని పంచుకుంటూ, అతని కుమార్తె రోహిణి ఆచార్య భావోద్వేగ సందేశాన్ని రాశారు.
లాలు తన నివాసం వద్ద మెట్లపై నుండి పడిపోవడంతో అతని భుజం దగ్గర ఫ్రాక్చర్ అయ్యింది. ఆరోగ్యం కూడా అకస్మాత్తుగా క్షీణించింది. ఆ తర్వాత వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ఇక్కడి ఐసీయూ వార్డులో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మంగళవారం ఉదయం లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య వీడియో కాల్ చేసి తండ్రితో మాట్లాడారు. ఈ సందర్భంగా రోహిణి తన తండ్రి పరిస్థితిని చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. రోహిణి తన ట్విట్టర్ హ్యాండిల్ నుండి తన తండ్రి తాజా చిత్రాన్ని కూడా షేర్ చేసింది.
'మై బ్యాక్‌బోన్ పాపా - గెట్ వెల్ సూన్'
తండ్రి లాలూ యాదవ్‌తో వీడియో కాల్ సంభాషణ తర్వాత రోహిణి ట్విట్టర్‌లో ఒక నోట్ పోస్ట్ చేశారు. అందులో ఇలా రాసుకొచ్చారు.. "నా హీరో, నా వెన్నెముక పాపా. త్వరగా కోలుకోండి. ప్రతి అవరోధం నుండి విముక్తి పొందారు. మీకు కోట్ల మంది ప్రజల ఆశీర్వాదం ఉంది అని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
నిజానికి లాలూ యాదవ్‌కి తన కూతుళ్లతో ఉన్న అనుబంధం చాలా ఎక్కువ. ముఖ్యంగా మిసా, రోహిణిలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ఉంటారు. అనేక కోర్టు కేసులకు తోడు, లాలూకు ఆరోగ్యం కూడా సరిగా సహకరించడం లేదు.. దీంతో లాలూ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
అందుకే ఆయన రాజకీయాల్లో అంత యాక్టివ్‌గా ఉండలేకపోతున్నారు. మరోవైపు కొడుకులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రతి రోజు ఆసుపత్రికి వెళ్లి తండ్రి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను అక్కడి వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు.
My hero
— Rohini Acharya (@RohiniAcharya2) July 5, 2022
My backbone Papa🙏
Get well soon 🤞
हर बाधाओं से जिसने पाई है मुक्ति
करोड़ों लोगों की दुआएं है जिनकी शक्ति🙏 pic.twitter.com/36ndAbRnTG
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com