క్షీణించిన బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ ఆరోగ్యం

బిహార్ మాజీ ముఖ్యమంత్రి,ఆర్జేడి పార్టీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించింది. ఆయన కిడ్నీలు 25శాతం మాత్రమే పనిచేస్తున్నాయని, భవిష్యత్‌లో ఎప్పుడైనా ఆయన ఆరోగ్యం ప్రమాద కరంగామారే అవకాశం ఉందని రాంచీలోని రిమ్స్ వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేశారు.
లాలూప్రసాద్ యాదవ్ గత 20 ఏళ్లుగా డయాబెటీస్‌తో బాధపడుతున్నారు. అందువల్ల ఆయన కిడ్నీలపనితీరు క్రమంగా క్షీణించాయని డాక్టర్ ప్రసాద్ వెల్లడించారు. డయాబెటీస్ వల్ల పాడైన అవయవాల పనితీరు మెరుగుడటం సాధ్యం కాదన్నారు. ఎలాంటి మందులైనా కిడ్నీ పనితీరును 25 నుంచి వందశాతం పెంచబోవన్నారు. రెసిడెంట్ నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించిన అనంతరం ఆయనకు ఎలాంటి వైద్యం అందించాలనేదానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
దాణా కుంభకోణానికి సంబందించిన ఓ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ లభించినప్పటికీ... మరో కేసులో ఊరట లభించలేదు. దీంతో ఆయన తరుపున్యాయవాది బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా.. ఝార్ఖండ్ హైకోర్టు ఆరువారాల పాటు కేసును వాయిదా వేసింది. ఆ లోపే ఈయన ఆరోగ్యం క్షీణించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com