Lalu Prasad Yadav: తండ్రి లాలూకు కిడ్నీ దానం చేయనున్న కూతురు..

Lalu Prasad Yadav: తండ్రి లాలూకు కిడ్నీ దానం చేయనున్న కూతురు..
Lalu Prasad Yadav: పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆర్జేడీ అధ్యక్షుడికి కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు.

Lalu Prasad Yadav: పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆర్జేడీ అధ్యక్షుడికి కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. అనారోగ్యంతో బాధపడుతున్న రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌కు సింగపూర్‌‌లో నివసిస్తున్న తన కుమార్తె.. తండ్రికి కిడ్నీ దానం చేయనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.


74 ఏళ్ల యాదవ్ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. చికిత్స కోసం సింగపూర్ వెళ్లి గత నెలలో తిరిగి వచ్చారు. సింగపూర్‌లో ఉన్న అతని కుమార్తె రోష్నీ ఆచార్య తన తండ్రికి కొత్త జీవితాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు.


ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న యాదవ్ బెయిల్‌పై బయట ఉన్నారు. పశుగ్రాసం కేసుల్లో ఇరుక్కున్న ఆయన జైలు జీవితం గడుపుతున్నారు. చికిత్స కోసం ఢిల్లీ, రాంచీల్లో పలుమార్లు ఆస్పత్రిలో చేరారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందనేది తెలియాల్సి ఉంది.

Tags

Next Story