జాతీయం

Lambda variant: కోవిడ్ కొత్త రూపు 'లాంబ్డా' వేరియంట్.. దాని లక్షణాలు..

కరోనాకి కొత్త కొత్త పేర్లు.. ప్రస్తుతం లాంబ్డా సీజన్ నడుస్తోందట. అప్రమత్తంగా ఉండమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

Lambda variant: కోవిడ్ కొత్త రూపు లాంబ్డా వేరియంట్.. దాని లక్షణాలు..
X

Lambda variant: పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పిహెచ్‌ఇ) శుక్రవారం (జూన్ 25) ప్రచురించిన గణాంకాల ప్రకారం లాంబ్డా వేరియంట్ యొక్క ఆరు కేసులను ఇంగ్లాండ్ నివేదించింది. కరోనా కాస్త తగ్గింది కదా అని ఊపిరి పీల్చుకుందామంటే కరోనా కొత్త వేరియంట్ లాంబ్డా ఊడిపడింది. కరోనాకి కొత్త కొత్త పేర్లు.. ప్రస్తుతం లాంబ్డా సీజన్ నడుస్తోందట. అప్రమత్తంగా ఉండమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కొత్త కోవిడ్ -19 వేరియంట్ 'లాంబ్డా' ఉనికిని ప్రకటించింది. ఈ వేరియంట్ మొట్టమొదట దక్షిణ అమెరికాలో కనుగొనబడింది. 'లాంబ్డా' సంక్రమణ విషయం నిశితంగా పరిశీలించబడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఇందులో B.1.1.7 (ఆల్ఫా), B.1.351 (బీటా), P.1 (గామా), B.1.427 (ఎప్సిలాన్) మరియు B.1.429 (ఎప్సిలాన్) ఉన్నాయి.

లాంబ్డా వేరియంట్:

లాంబ్డా మొదట్లో 2020 ఆగస్టులో పెరూలో కనుగొనబడింది. అప్పటి నుండి ప్రపంచంలోని 29 దేశాలలో, ఎక్కువగా లాటిన్ అమెరికా, అర్జెంటీనా, చిలీ దేశాలలో ఈ వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, లాంబ్డా వేరియంట్‌లో స్పైక్ ప్రోటీన్‌లో బహుళ ఉత్పరివర్తనలు ఉన్నాయి. ఈ ఉత్పరివర్తనలు వేరియంట్ యొక్క ట్రాన్స్మిసిబిలిటీపై ప్రభావం చూపుతాయి.

పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పిహెచ్‌ఇ) "వైరస్ యొక్క ప్రవర్తనపై ఉత్పరివర్తనాల ప్రభావాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయోగశాల పరీక్షను నిర్వహిస్తోంది.

లాంబ్డా వేరియంట్- లక్షణాలు:

పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పిహెచ్‌ఇ) ప్రస్తుతం లాంబ్డా వేరియంట్ మరింత తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని తెలిపింది. ప్రస్తుత టీకాలు కూడా ఈ వేరియంట్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది ఇంకా అంచనా వేయలేదు.

నిరంతర దగ్గు.- వాసన లేదా రుచి కోల్పోవడం జరుగుతుంది. COVID లక్షణాలు కూడా ఈ విధంగానే ఉన్నాయి.

COVID-19 ఉన్న ముగ్గురు వ్యక్తులలో ఎవరికైనా లక్షణాలు లేకపోయినా ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ కోవిడ్ నియమావళిని పాటిస్తూ జాగ్రత్తగా ఉండమని సలహా ఇస్తున్నారు.

COVID లక్షణాలు ఉన్న ఎవరైనా వారి ఇంటి సభ్యులతో పాటు స్వీయ నిర్భంధంలో ఉండాలి. COVID లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులు వీరికి COVID-19 ఉందో లేదో ధృవీకరించడానికి వీలైనంత త్వరగా PCR పరీక్షను కూడా పొందాలి.

Also Read :

నాన్నా ఎందుకిలా చేశావు.. అమ్మ మమ్మల్ని ఏం చేసిందో చూడు..

ఈ ముగ్గురు అక్కాచెల్లెల్లతో ఆడిపాడిన ఏకైక హీరో..!

ఇమ్మానుయేల్ కి వేరే అమ్మాయితో పెళ్లి .. లైవ్‌లో కంటతడి పెట్టుకున్న వర్ష..!

ఇదేం మోసం రా బాబు.. భార్యని చెల్లి అని చెప్పి..


Next Story

RELATED STORIES