Land for Job Scam : తేజస్వీ యాదవ్ కు సీబీఐ సమన్లు

ఉద్యోగాల కుంభకోణం కేసులో బీహార్ మాజీ ఉప ముఖ్య మంత్రి తేజస్వీ యాదవ్ ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియా ( సీబీఐ ) శనివారం విచారణకు పిలిచింది. రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కొడుకు తేజస్వీకి ఫిబ్రవరి 4న సమన్లు జారీ చేసింది. పేపర్ ట్రయిల్ ఆధారంగా సమన్లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. అయినా ఆయన దర్యాప్తు సంస్ధ ముందు హాజరు కాలేదు.
భూముల కుంభకోణం కేసుకు సంబంధించి... మార్చి 10న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ ) తేజస్వి యాదవ్ ఢిల్లీ నివాసంలో దాడులు నిర్వహించింది. ఈ వారం ప్రారంభంలోనే ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ, పాట్నాలో చాలా సేపు ప్రశ్నించింది. బీజేపీ తన కుటుంబంపై కక్ష కట్టిందని అందుకే జాతీయ సంస్థలతో తమపై దాడులు చేయిస్తుందని అన్నారు తేజస్వి.
కేసు వివరాలు..!
రైల్వే ఉద్యోగాలను అమ్ముకున్నారని అందుకు ప్రతిఫలంగా సదరు వ్యక్తుల నుంచి భూములను లంచంగా తీసుకున్నారని తెలిపారు అధికారులు.
యాదవ్ కుటుంబానికి అతని సహచరులకు బహుమతిగా లేక తక్కువ ధరకు భూములను విక్రయించినట్లు తెలిపారు. ఇందుకు ప్రతి ఫలంగా రైల్వేలో సదరు వ్యక్తులకు ఉద్యోగాలను ఇచ్చినట్లు చెప్పారు. కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవితో పాటు మరో 14మందిపై నేరపూరిత కుట్ర, అవినీతి నిదోధక చట్టంలోని నిబంధనల కింద సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసింది. నిందితులందరికీ మార్చి 15న సమన్లు జారీ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com