LIC పాలసీ.. రోజుకు రూ.262 పెట్టుబడితో 20 లక్షలకు పైగా..

LIC పాలసీ.. రోజుకు రూ.262 పెట్టుబడితో 20 లక్షలకు పైగా..
LIC:జీవిత బీమా చేసిన వ్యక్తి మొత్తం పాలసీ వ్యవధిలో జీవించి ఉంటే, పాలసీ యొక్క అన్ని ప్రీమియంలు సక్రమంగా చెల్లించి ఉంటే, బీమా చేయబడిన వ్యక్తికి మెచ్యూరిటీపై హామీ మొత్తం అందించబడుతుంది.

LIC: భారతదేశంలోని ప్రముఖ బీమా ప్రొవైడర్‌లలో ఒకటి LIC జీవన్ లాభ్ ఒకటి. LIC అందించే బెస్ట్ సెల్లింగ్ ఎండోమెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో ఒకటి. LIC జీవన్ లాబ్ పాలసీ బీమా కొనుగోలుదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. LIC జీవన్ లాభ్ పాలసీ గురించిన వివరాలు..

ఈ పాలసీని 2020 ఫిబ్రవరి1న ఎల్‌ఐసీ ప్రారంభించింది. పాలసీలో భాగంగా రోజుకు రూ.262 (నెలకు రూ.7916) చొప్పున నిర్ణీత గడువులోపు కట్టినట్లయితే.. దాదాపు రూ.20 లక్షల వరకు తిరిగి పొందే అవకాశం ఉంది.

8 నుంచి 59 ఏళ్ల వారు ఈ పాలసీలో జాయిన్ అవ్వడానికి అర్హులు. ప్రీమియం 3, 6, ఏడాదికి ఒకసారి చెల్లించే వెసులుబాటు ఉంది. ఇక నెలవారీ చెల్లింపులపై 15 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది.

మూడు సంవత్సరాల పాటు సాధారణ ప్రీమియం చెల్లించిన తర్వాత, పాలసీదారులు ఈ ప్లాన్‌పై లోన్ తీసుకోవచ్చు.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C మరియు 10(10D) కింద పన్ను ప్రయోజనాలను పొందవచ్చు.

పాలసీ వ్యవధిలో బీమా చేయబడిన వ్యక్తి దురదృష్టవశాత్తు మరణిస్తే, పాలసీ యొక్క లబ్ధిదారునికి ఆ మొత్తాన్ని చెల్లిస్తారు. పాలసీ మెచ్యూరిటీ పీరియడ్ 8ఏళ్లు.

మెచ్యూరిటీ బెనిఫిట్

జీవిత బీమా చేసిన వ్యక్తి మొత్తం పాలసీ వ్యవధిలో జీవించి ఉంటే, పాలసీ యొక్క అన్ని ప్రీమియంలు సక్రమంగా చెల్లించి ఉంటే, బీమా చేయబడిన వ్యక్తికి మెచ్యూరిటీపై హామీ మొత్తం అందించబడుతుంది. దానితో పాటుగా సాధారణ రివర్షనరీ బోనస్ కూడా అందిస్తారు.

పన్ను ప్రయోజనాలు

పాలసీదారుడు పాలసీ కింద అందించే పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ట పరిమితి రూ.1.5 లక్షల వరకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C మరియు 10(10D) కింద పన్ను మినహాయింపు ఉంటుంది.

Tags

Next Story